నల్గొండ:
ప్రస్తుతం రాజకీయాలంటేనే ప్రజలు చీత్కరించుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ
సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు
మంగళవారం అన్నారు. ఈనాటి రాజకీయ పరిస్థితులను
వెండి తెరపై విపులంగా చూపించేందుకు
గాను తాను అసెంబ్లీలో దొంగలు
పడ్డారు అనే టైటిల్తో
చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటి
రాజకీయాలు పూర్తిగా చెడిపోయాయని, వాటిని సినిమాలో చూపిస్తానని చెప్పారు.
నల్గొండ
జిల్లా నాగార్జునసాగర్లోని విజయవిహార్ అతిథి
గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఒంగోలులో మృతి చెందిన దాసరి
యువసేన కన్వీనర్ జింకా రమేష్ కుటుంబాన్ని
పరామర్శించి ఆయన హైదరాబాదుకు తిరుగు
ప్రయాణం అయ్యారు. ఈ సమయంలో ఆయన
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అక్కడి అతిథి గృహంలో ఆగారు.
ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు
చేశారు.
కాగా
దాసరి నారాయణ రావు అసెంబ్లీలో దొంగలు
పడ్డారు చిత్రం తీస్తున్న విషయం తెలిసిందే. ఈ
సినిమాలో ఆయన ప్రధానంగా చిరంజీవినే
టార్గెట్ పెట్టుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన గతంలో తీసిన
మేస్త్రీ చిత్రం చిరంజీవిపై వ్యంగాస్త్రం అనే వాదన ఉన్న
విషయం తెలిసిందే.
తాజాగా
ఆయన అసెంబ్లీలో రౌడీలు పడ్డారు కూడా ప్రస్తుత పూర్తి
రాజకీయాలను చూపించినప్పటికీ ప్రధానంగా చిరంజీవినే లక్ష్యంగా చేసుకుంటారని అంటున్నారు. చిరుకు, దాసరికి మధ్య పచ్చగడ్డి వేస్తే
భగ్గుమనే విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.
ఇటీవల చిరంజీవి రాజ్యసభకు ఎంపికైన విషయం తెలిసిందే.
అయితే
దాసరి నారాయణ రావు స్థానంలోనే చిరును
తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. దీంతో దాసరి నారాయణ
రావు కాంగ్రెసు పైనా అసంతృప్తితో ఉన్నారని
అంటున్నారు. ఇటీవల చిరంజీవి తన
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. విలీనంపై విపక్షాలు.. హోల్ సేల్గా
చిరు పార్టీని అమ్మారంటూ విమర్శిస్తున్నాయి. ఈ కోణంలో చూస్తే
దాసరి తన తాజా సినిమాలో
చిరంజీవిపై మేస్త్రీ కంటే ఘాటుగానే వ్యంగ్యాస్త్రాలు
విసిరే అవకాశం ఉందని అంటున్నారు.
0 comments:
Post a Comment