హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీలో కేంద్ర హోంమంత్రి చిదంబరం వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. తెలుగుదేశం
పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు..
చిదంబరాన్ని కలిశారన్న వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి, కాంగ్రెసు తదితర తెలంగాణ పార్టీ
నేతలు కూడా బాబును నిలదీశారు.
టిడిపిలోనూ ఆయన వ్యాఖ్యలపై తీవ్రమైన
చర్చ జరుగుతోంది. చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన
నేతలతో తాను చిదంబరంను వ్యక్తిగతంగా
కలవలేదని చెప్పారు.
తాను
కలిశానని సభలో చిదంబరం చేసిన
వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు.
కేంద్రం అసలు సమస్యకు పరిష్కారం
చూపించకుండా దానిని పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయని బాబు నేతలతో చెప్పారు.
కావాలనే తెలుగుదేశం పార్టీ పైన, తన పైన
చిదంబరం నిందలు వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం
చేశారు.
చిదంబరం
వ్యాఖ్యలను కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే ఎల్ రమణ కొట్టి
పారేశారు. తెలంగాణపై తాను చిదంబరాన్ని ఎన్నడూ
కలవలేదని బాబు తమతో చెప్పారన్నారు.
అంశాన్ని పక్కదోవ పట్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు కేంద్రం చేస్తోందని విమర్శించారు. గతంలో తాము తెలంగాణపై
చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
చిదంబరం
మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదని
మరో నేత పెద్దిరెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల
చంద్రశేఖర రావు ఆయనను వందసార్లు
కలిశారని, జెఏసి నేతలు కలిశారని
చెప్పారు. చిదంబరాన్ని అందరూ ఛీ కొడుతున్నారని
అన్నారు. తమ అధినేతకు ఆయనను
తెలంగాణపై కలవాల్సిన అవసరం లేదని చెప్పారు.
కాగా
తనను చంద్రబాబు కలిశారని చిదంబరం సభలో చేసిన వ్యాఖ్యలపై
నాగం జనార్ధన్ రెడ్డి బాబును నిలదీశారు. బాబు ఆయనకు ఏం
చెప్పారో ప్రజలకు వివరించాలని హరీశ్వర్ రెడ్డితో కలిసి నాగం అన్నారు.
చిదంబరాన్ని కలవాల్సిన అఘాయిత్యం ఏమొచ్చిందని ప్రశ్నించారు. వారు కేంద్రమంత్రి జైపాల్
రెడ్డిని కలిసి, తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకనేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు.
చిదంబరంతో
ఏమ మాట్లాడారో చంద్రబాబు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాలని తెరాస
నేత వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు దీనిపై ఆయనను
నిలదీయాలన్నారు. తెలంగాణను అడ్డుకోవడానికే చంద్రబాబు కలిసి ఉంటారని ప్రభుత్వ
చీప్ విఫ్ గండ్ర వెంకట
రమణ రెడ్డి ఆరోపించారు. పరకాల టిక్కెట్ కాంగ్రెసు
వారికే ఇవ్వాలని, సమ్మారావుకు ఇవ్వడం ఎవరికీ సమ్మతం కాదని ఆయన చెప్పారు.
0 comments:
Post a Comment