కడప:
మీరు వేసే ప్రతి ఓటు
తమకు కాదని, ప్రతి పేదవాడికి, రైతుకు
అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం అన్నారు. ఆయన కడప జిల్లాలోని
రాజంపేట నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం
నిర్వహించారు. ఈ సందర్భంగా పలు
చోట్ల ఆయన ప్రజలను ఉద్దేశించి
మాట్లాడారు.
త్వరలో
జరగనున్న ఉప ఎన్నికలలో మీరు
వేసే ఓటు పాలకులకు పెద్ద
కనువిప్పు కావాలని ఆయన అన్నారు. ప్రజల
కోసం పార్లమెంటు, శాసనసభ్యత్వాలను వదులుకున్న నేతలను తిరిగి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో అమర్నాథ్ రెడ్డి రైతులు, పేదల పక్షాన ఓటు
వేశారన్నారు. ప్రభుత్వాన్ని ధిక్కరించి ఆయన ఓటు వేసి
అనర్హత వేటు వేయించుకున్నారన్నారు.
అలాంటి
వ్యక్తిని గెలుపించుకోవాల్సి ఉందన్నారు. తమ పార్టీ అధికారంలోకి
రాగానే ఖాదర్ బంగ్లా - మాచుపల్లి
బ్రిడ్జి నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు. మాచుపల్లి
- లింగంపల్లి ప్రొటక్షన్ వాల్ నిర్మాణం కూడా
పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.
తిరుపతిలో ప్రచారం ముగించిన జగన్ కడప జిల్లాలో
ఉప ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు.
కాగా
తిరుపతి నియోజకవర్గ ప్రజలను చిరంజీవి నట్టేట ముంచారని మాజీ మంత్రి హరిరామజోగయ్య
చిత్తూరు జిల్లాలో అన్నారు. స్థానికుల నమ్మకాన్ని వమ్ము చేసి ఢిల్లీకి
వెళ్లడం శోచనీయమన్నారు. కాపులు చిరంజీవిని పరిస్థితిలో లేరని, ఇక చిరంజీవి రాజకీయ
భవిష్యత్తు అంధకారమే అని అన్నారు.
కాపులపై
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
ప్రదర్శిస్తున్నది కపట ప్రేమ అన్నారు.
ఉప ఎన్నికలలో లబ్ధి పొందేందుకు చంద్రబాబు
నాటకాలు ఆడుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
కుటుంబానికి అన్ని మతాల పైన
గౌరవం ఉందన్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన జగన్ను డిక్లరేషన్
పేరిట అవమానించడం బాధాకరమన్నారు.
0 comments:
Post a Comment