హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ చిట్టెలుక అని
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాసనసభ్యుడు ఆనం వివేకానంద రెడ్డి
గురువారం అన్నారు. జిల్లా నేతలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స
సత్యనారాయణ భేటీ అయ్యారు. భేటీ
అనంతరం ఆనం విలేకరులతో మాట్లాడారు.
జిల్లాలో
కాంగ్రెసు పార్టీ నేతల మధ్య ఎలాంటి
విభేదాలు లేవని ఆయన చెప్పారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పారు.
టి.సుబ్బిరామి రెడ్డి జాతీయ స్థాయి నేత
అని, అలాంటి వ్యక్తిని గెలిపించే బాధ్యత పూర్తిగా తమదేనని చెప్పారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలో కలవడం అసంభవమని అన్నారు.
జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల మధ్య తీవ్ర
విభేదాలు ఉన్నాయని చెప్పారు.
వైయస్
జగన్ నిజ స్వరూపం ఉప
ఎన్నికల ప్రచార సమయంలో బయటపెడతామని చెప్పారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో మెజార్టీ
స్థానాలను కాంగ్రెసు పార్టీయే కైవసం చేసుకుంటుందని ఆనం
వివేకానంద రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు.
నిత్యం
విశ్వసనీయత, విలువల గురించి మాట్లాడే వైయస్ జగన్ మంగళి
కృష్ణ, కర్నాటక మాజీ మంత్రి గాలి
జనార్ధన్ రెడ్డిలు కేసులలో ఇరుక్కున్న తర్వాత వారెవరో తనకు తెలియదని అంటున్నారని
మంత్రి శైలజానాథ్ ఎద్దేవా చేశారు. ఇదేనా విశ్వసనీయత అంటే
అని ప్రశ్నించారు.
తను పేదవాడిని అన్న జగన్ వ్యాఖ్యలకు
శైలజానాథ్ కౌంటర్ ఇచ్చారు. కోట్లాది రూపాయలతో ఇల్లు కట్టుకున్న వ్యక్తి
పేదవాడు ఎలా అవుతాడన్నారు. ఆయనకు
విశ్వసనీయత, విలువలు ఏమాత్రం లేవన్నారు. అధఇకారం కోసం తెలుగుదేశం పార్టీ
అధినేత నారా చంద్రబాబు నాయుడు
ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
0 comments:
Post a Comment