హైదరాబాద్/అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
మంగళవారం అనంతపురం జిల్లాలో మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అనంతలో మేడే
ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు. కొన్ని మీడియా సంస్థలు ప్రజల కోసం నిత్యం
తపించే తమలాంటి వారిని గుర్తించకుండా మద్దెలచెర్వు సూరి హత్య కేసులో
ప్రధాన నిందితుడు భాను కిరణ్ లాంటి
వారికి అశేష ప్రచారం కల్పిస్తోందని
విమర్శించారు. కాంగ్రెసు పాలనలో నిత్యావసర ధరలు భారీగా పెరుగుతున్నాయన్నారు.
ఎమ్మెల్యే
రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్
పైన మండిపడ్డారు. ఢిల్లీ నుండి వచ్చిన ఆజాద్
సిఎం క్యాంపు కార్యాలయంలో పార్టీ సమావేశం పెట్టడమే కాకుండా కిరణ్ కుర్చీలో కూర్చోవడం
సరికాదన్నారు. కాంగ్రెసు నేతలకు రాజ్యాంగంపై గౌరవం లేనట్లుగా ఉందన్నారు.
అందుకే అధికార కుర్చీలో ఆజాద్ కూర్చున్నారని విమర్శించారు.
దీనిపై ఆజాద్ వెంటనే క్షమాపణ
చెప్పాలని డిమాండ్ చేశారు.
లేదంటే
వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. 1982లో నాటి ముఖ్యమంత్రి
అంజయ్యను ఢిల్లీ కాంగ్రెసు పెద్దలు అవమానపరిస్తే తెలుగు ప్రజలు బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. కిరణ్ ముఖ్యమంత్రి అయి
పదహారు నెలలు కావొస్తుందని, ఆయన
రాష్ట్రంలో ఉండటం కంటే ఢిల్లీలోనే
ఎక్కువగా ఉంటున్నారన్నారు. ఆయన ఢిల్లీలో ఉంటూ
అప్పుడప్పుడు ఇక్కడకు వస్తున్నారన్నారు. సిఎం కార్యాలయంలో వేల
ఫైళ్లు పెండింగులో ఉన్నాయన్నారు. ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో
సిఎం నిర్లక్ష్యంగా వహిస్తున్నారన్నారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి
ఆస్తుల కేసులో ఎ-2 నేరస్తుడిగా ఉన్న
విజయ సాయి రెడ్డి రాజకీయాలలోకి
వస్తానన్న అంశంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఇలాంటి వారు రాజకీయాలలోకి వస్తే
ప్రజలు గట్టి బుద్ధి చెబుతారన్నారు.
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
మరోవైపు
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై
ఇఛ్చాపురం టిడిపి ఎమ్మెల్యే సాయినాథ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాకరాపల్లి ప్రాజెక్టులో కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసుకు వాటాలు ఉన్నాయని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయన్నారు. బాధితులకు న్యాయం చేసేందుకు టిడిపి పోరాటం చేస్తుందన్నారు. ప్రజల డిమాండ్ మేరకు
అక్కడ పవర్ ప్లాంట్ కట్ట
వద్దన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
బతికి ఉంటే అక్కడి వారిని
పిట్టల్ని కాల్చినట్టు కాల్చేవాడని ధ్వజమెత్తారు.
0 comments:
Post a Comment