కడప:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై
మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి
మరోమారు నిప్పులు చెరిగారు. గురువారం ఆయన కడప జిల్లాలో
కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసు పార్టీలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి అసలైన కోవర్టు ముఖ్యమంత్రియేనని
ఆయన పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
సిఎంకు దమ్ముంటే జగన్ పైన విమర్శలు
చేయాలని సవాల్ విసిరారు.
వైయస్
జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సిఎం ఇప్పటి వరకు
ఒక్క మాట మాట్లాడలేదన్నారు. ఆయనకు
దమ్ముంటే జగన్పై విమర్శలు
చేయమనండి అన్నారు. జగన్ వర్గం నేతలు
శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులుపై అనర్హత వేటు వేయవద్దని స్పీకర్కు ముఖ్యమంత్రి చెప్పింది
నిజం కాదా అని ప్రశ్నించారు.
ఉప ఎన్నికల తర్వాత కొందరిపై అధిష్టానం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
పదవులు,
పైరవీలు చేసే వీర శివా
రెడ్డి, వరదరాజులు రెడ్డి తనపై ఆరోపణలు చేయడం
హాస్యాస్పదమని మండిపడ్డారు. స్పీకర్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి
అడ్డదారిలో అధిష్టానాన్ని 48సార్లు కలిశారని ఆరోపించారు. రాష్ట్రంలో నెంబర్ వన్గా ఉన్న
నేతే జగన్పై విమర్శలు
చేయడం లేదని అన్నారు.
తనపై
వచ్చిన ఆరోపణలకు ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని
చెప్పారు. కాంగ్రెసు పార్టీ కార్యాలయం గాంధీ భవనంలో స్వపక్షం
నేతలపై విమర్శలు చేసే వారికే అవకాశం
కల్పిస్తున్నారని నిప్పులుగక్కారు. కాగా బుధవారం కూడా
డిఎల్ రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రిపై తీవ్రమైన విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై కిరణ్ వర్గం నేతలు
అప్పుడే తిప్పుకొట్టారు.
0 comments:
Post a Comment