తిరుపతి/వరంగల్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు
ఒక్కటై తమ పార్టీ అధ్యక్షుడు,
కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి
విషయంలో గేమ్ ఆడుతున్నారని వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మంగళవారం
అన్నారు. ఆయన తిరుపతిలోని పార్టీ
కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు మత విద్వేశాలు రెచ్చగొడుతున్నారని
ఆరోపించారు.
కులాలు,
మతాల పేరిట రాజకీయం చేస్తున్నారని
మండిపడ్డారు. దీనిపై తాము ఎన్నికల సంఘానికి
ఫిర్యాదు చేస్తామని చెప్పారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అన్ని నియోజకవర్గాలలో క్లీన్
స్వీప్ చేస్తుందన్నారు. జగన్కు హైదరాబాదులో
ఎనబై పడగ గదుల భవనం
ఉందని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే దానిని పరిశీలించేందుకు రావాలని సవాల్ విసిరారు.
కిరణ్కు ఏమాత్రం సిగ్గు
లేదన్నారు. కిరణ్ గానీ, మరెవరైనా
జగన్ ఇంటిలో ఎనబై గదులు ఉన్నట్లు
నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం
చేస్తానని సవాల్ చేశారు. ఉప
ఎన్నికలలో కాంగ్రెసు, టిడిపి రెండో స్థానం కోసమే
పోటీ పడుతున్నాయన్నారు. సమన్లు జారీ చేసినందున సిబిఐ
కోర్టుకు జగన్ హాజరవుతారని ఆయన
చెప్పారు.
కాగా
జగన్ను ఎదుర్కొనేందుకు చంద్రబాబు
నాయుడు భయపడుతున్నారని జ్యోతుల నెహ్రూ వేరుగా అన్నారు. బాబు జగన్ను
విమర్శించడం సరికాదన్నారు. ఆయన ఆలాగే విమర్శలు
చేస్తే నష్టం ఆయనకే అన్నారు.
ఆయన విమర్సల వల్ల జగన్ ఇమేజ్
డ్యామేజ్ కాదని, ఇంకా పెరుగుతుందని చెప్పారు.
తెలంగాణ
రాష్ట్రం ఎప్పుడు వస్తుందో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల
చంద్రశేఖర రావు ఖచ్చితమైన తేది
ప్రకటించాలని మాజీ మంత్రి, వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నేత కొండా సురేఖ
మంగళవారం వరంగల్ జిల్లాలో డిమాండ్ చేశారు. కెసిఆర్ తేదిని ప్రకటిస్తే తాను పోటీ నుండి
తప్పుకుంటానని ఆమె సవాల్ చేశారు.
తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది విద్యార్థులు బలయ్యారని,
వారి కుటుంబాలను పరామర్శించని కెసిఆర్ పరకాలలో ఓట్లు ఎలా అడుగుతారన్నారు.
0 comments:
Post a Comment