రామ్,
తమన్నా జంటగా ప్రముఖ దర్శకుడు
కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎందుకంటే ప్రేమంట’.
ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. స్రవంతి
రవికిషోర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూన్
1 న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజున ఈ
చిత్రాన్ని తమిళంలో ‘ఎన్ ఎండ్రల్ కాదల్
ఎన్బెన్’ పేరుతో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ చిత్రం
క్యూట్ రొమాంటిక్ స్టోరీగా చెప్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో
విడుదలై ఛార్ట్ బస్టర్ గా నిలిచింది.
దర్శకుడు
కరణాకరన్ మాట్లాడుతూ..అబ్బాయి రాసిన లేఖలో పిచ్చి
రాతలన్నీ కవితల్లా కనిపిస్తే... అమ్మాయి చేత్తో ఇచ్చిన కషాయం కూడా కమ్మని
పానీయంలా అనిపిస్తే... ఆ ఇద్దరూ తప్పకుండా
ప్రేమలో ఉన్నట్టే. ప్రేమలోపడితే లోకమే గమ్మత్తుగా అనిపిస్తుంది.
అదే విచిత్రాలు చేయిస్తుంది. ప్రేమలో పడిన ఓ జంటకూ
ఇదే అనుభూతి కలిగింది. ఆ కథేమిటో తెలియాలంటే
మా ' ఎందుకంటే ప్రేమంట'సినిమా చూడాల్సిందే అన్నారు.
నిర్మాత
స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ ''ప్రేమలోని అనుభూతుల్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఆ
క్షణాల్ని ఆస్వాదించాలంతే. మా సినిమాలో వాటిని
వెండి తెరపై ఆవిష్కరించాం. రామ్
ఈ సినిమాతోనే తమిళంలో అడుగుపెడుతున్నాడు. రామ్ చెన్నైలోనే పుట్టి
పెరిగాడు. తమిళ భాషపై మంచి
పట్టు ఉంది. ఇక తమన్నా
అక్కడి ప్రేక్షకులకు ఎంతో చేరువైంది. ఈ
ప్రేమ కథ అన్ని భాషలవారికీ
నచ్చుతుంది. ఇటీవలే తమిళనాడులోనూ ప్రచారానికి శ్రీకారం చుట్టాము''అన్నారు.
ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ- యువతరాన్ని
వెంటాడే ప్రేమ కథగా ఈ
చిత్రం రూపొందుతుందని, కరుణాకరన్ కలర్ఫుల్గా
చిత్రీకరించాడని చెప్పారు. అలాగే జెనీవా స్విట్జర్లాండ్లలో షూట్ చేసిన
పాటలు హైలెట్‌గా ఉంటాయని తెలిపారు.
రాధికా ఆప్టే, సుమన్, షాయాజిషిండే, రఘుబాబు, సుమన్‌శెట్టి తదితరులు
నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:
జి.వి.ప్రకాష్‌కుమార్,
నిర్మాత: పి.రవికిషోర్, కథ,
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణాకరన్.
0 comments:
Post a Comment