హైదరాబాద్:
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
మహాభారతంలో దృతరాష్ట్రుడి వంటి వారని తెలుగుదేశం
పార్టీ నేత వర్ల రామయ్య
మండిపడ్డారు. ఆయన హైదరాబాదులోని పార్టీ
కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన..
నీ తండ్రి దృతరాష్ట్రుడు వంటి వాడు కాదా
చెప్పాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.
జగన్
మాట అసత్యమని, చేష్టలు అసాంఘీకమని, మనస్తత్వం నేరపూరితమన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి
జనార్ధన్ రెడ్డి ఎవరో తనకు తెలియదని
చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ చెబుతున్న అసత్యాలను
రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బళ్లారి గాలి జనార్ధన్ రెడ్డి
ఇంటి నుంచి డబ్బు పంపిణీ
జరుగుతోందని ఆయన ఆరోపించారు.
ఆస్తుల
కేసులో ఎ-1 నిందితుడిగా ఉన్న
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేక పోతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
నారాయణ విజయనగరంలో ప్రశ్నించారు. ఆస్తులను అక్రమంగా కూడబెట్టారని పూర్తి ఆధారాలు ఉన్నప్పుడు కూడా నిందితులను ఎందుకు
అరెస్టు చేయకూడదని ఆయన నిలదీశారు.
తండ్రి
తర్వాత కుమారుడు పదవులు చేపట్టే రాచరిక పాలన లేదన్నారు. కాంగ్రెసు
నాయకులు ప్రజలను మభ్య పెట్టేందుకు రకరకాల
ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. కాగా జగన్ సిపిఐ
పార్టీ ఉప ఎన్నికలలో సీమాంధ్రలో
తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికిన విషయం తెలిసిందే. తెలంగాణలో
మాత్రం తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు పలికింది.
0 comments:
Post a Comment