పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి
భారీ విజయాలు బ్రది, ఖుషి చిత్రాలు వచ్చి
పదేళ్లయింది. ఆ మధ్య జల్సా
హిట్ ఇచ్చినా.....ఆ రేంజిలో సక్సెస్
కాలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత
పవర్ స్టార్ ఆ రేంజి విజయం
గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా
సొంతం చేసుకున్నాడు. ఈ రోజు విడుదలైన
గబ్బర్ సింగ్ చిత్రం అభిమానుల
అంచనాలను రీచ్ అయి సూపర్
హిట్ టాక్ తెచ్చుకుంది. క్లాస్,
మాస్ ప్రేక్షకులతో పాటు అందరినీ అలరిస్తోంది.
ముఖ్యంగా
సినిమాలో వవన్ కళ్యాణ్ చేసిన
డాన్సులు, ఫైట్స్ కేక పుట్టిస్తున్నాయి. పవర్
స్టార్ చెప్పే డైలాగులకు థియేటర్లలో విజిల్సే విజిల్స్. సినిమాలో ఎక్కడా బోరింగ్ అనేది లేకుండా ఉండటం
సినిమాకు ప్లస్సయింది. మొత్తానికి ఈచిత్రం పదేళ్లుగా అభిమానులు ఎదురు చూస్తున్న పెద్ద
హిట్ గా నిలిచింది. తొలి
రోజే సినిమా హిట్ టాక్ సొంతం
చేసుకోవడంతో ఇటు దర్శక, నిర్మాతలు
కూడా ఊపిరి పీల్చుకున్నారు.
ఈచిత్రం
తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టడం ఖాయం అని అభిమానులు
పండగ చేసుకుంటున్నారు. రేపటి నుంచి రాష్ట్ర
వ్యాప్తంగా సందడి చేసేందుకు సిద్ధం
అయ్యారు. విజయోత్సవ ర్యాలీలు, కటౌట్లు, ప్రకటనలతో కొన్ని రోజుల పాటు రాష్ట్రంలో
గబ్బర్ సింగ్ మేనియా రాజ్యమేలడం
ఖాయంగా కనిపిస్తోంది.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్
విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం
రాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న
సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్
కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ
: శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీప్లే,
మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్







0 comments:
Post a Comment