పవన్
కళ్యాణ్, శృతి హాసన్ జంటగా
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై
రూపొందిన చిత్రం ‘గబ్బర్ సింగ్’.
హరీష్శంకర్ ఎస్ దర్శకత్వంలో
బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని
నిర్మించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్
ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. మే 4న సెన్సార్
జరుపుకోనుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ
సెన్సార్ డేట్ మే 7కి
ఫోస్ట్ ఫోన్ అయ్యింది. దాంతో
చిత్రం కూడా వాయిదా పడే
అవకాశముందంటూ రూమర్స్ ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో తమ
సినిమా మే 11 న ఖచ్చితంగా
రిలీజ్ అవుతుందని నిర్మాత గణేష్ బాబు కన్ఫర్మ్
చేసి చెప్పారు.
చిత్రం
గురించి మాట్లాడుతూ..''దబాంగ్ సినిమాకి రీమేక్ అయినా... తెలుగు వాతావరణానికి, పవన్‌కల్యాణ్ శైలికి
అనుగుణంగా చాలా మార్పులు చేశాం.
గన్నులాంటి పాత్రను ఆయన పోషించారు. 'గబ్బర్సింగ్'గా పవన్ హావభావాలు,
నటన ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి'' బండ్ల
గణేష్ అన్నారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తున్న
నేపధ్యంలో ప్రేక్షకుల అంచనాలు పూర్తిగా నిజమవుతాయని ఆయన అన్నారు.
‘‘గుండెజారి
గల్లంతయ్యిందే... తీరా చూస్తే నీ
దగ్గర ఉందే.... నీలో ఏదో తీయని
విషముందే... నా ఒంట్లోకి సర్రున
పాకిందే...’’...ఈ పాటను మొన్ననే
స్విట్జర్ల్యాండ్లో చిత్రీకరించారు. చేతిలోని
గొడుగులు సైతం ఎగిరిపోయే చల్లని
మంచు మలయమారుతాల మధ్య ఆహ్లాదభరితమైన వాతావరణంలో
ఈ పాట చిత్రీకరణ జరిగిందని
కథానాయిక శ్రుతిహాసన్ చెప్పారు. షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోందీ సినిమా.
ఇక దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ...నేరగాళ్లను కటకటాల్లోకి నెట్టేందుకు చట్టాలు, నిబంధనలూ ఉంటాయి. అయితే ఆ పోలీసాయన
మాత్రం తనకంటూ ఓ చట్టం రాసుకొన్నాడు.
దాని ప్రకారమే పని చేస్తాడు అతగాడి
కథేమిటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే
అన్నారు. అలాగే ఇందులో పవర్స్టార్ కేరక్టరైజేషన్ అభిమానులు పండగ చేసుకునే విధంగా
ఉంటుంది. ‘గబ్బర్సింగ్’గా కొత్త పవన్కళ్యాణ్ని చూస్తారు. పవర్స్టార్ చిత్రాల్లో ‘గబ్బర్సింగ్’ నంబర్‌వన్‌గా
నిలిచే సినిమా అవుతుంది ’’అని నమ్మకం వ్యక్తం
చేశారు.
మలైకా
అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని,
బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు,
రావు రమేష్, ఫిష్ వెంకట్, అలీ,
మాస్టర్ ఆకాష్, ప్రభాస్ శ్రీను తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:
జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజ్, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం:
హరీష్శంకర్ ఎస్.







0 comments:
Post a Comment