తమన్నా
తో కలిసి రాజమౌళి 'దోమ'లో చేస్తామంటూ..దోమ..ఈగ కన్నా మరింత
పరవ్ ఫుల్ అంటూ రామ్
చరణ్ చమత్కరించారు. ఓ టీవీ ఛానెల్
తో రచ్చ ప్రమోషన్ లో
భాగంగా తమన్నాతో కలిసి రామ్ చరణ్
మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే
ఆరెంజ్ చిత్రం టైమ్ లో తాను
లవ్ స్టోరీ చేద్దామనుకుని ఫిక్స్ అయ్యి చేసానని,ఇప్పుడు
మాత్రం మాస్ సినిమా చేయాలనుకునే
రచ్చ చిత్రం చేసానని అన్నారు. అలాగే తనను చాలా
అందంగా సమీర్ రెడ్డి రచ్చలో
చూపించారని అన్నారు. మాస్ సినిమాలు చేస్తే
ఎక్కువ మంది చూస్తారని,తన
తండ్రి అభిమానులు సైతం తన రచ్చని
చాలా ఎంజాయ్ చేసారని చెప్పుకొచ్చారు.
ఇక రచ్చ పాటల్లో...వానా
వానా పాట తర్వాత చెర్రి
చెర్రీ పాట బాగా నచ్చింది
అన్నారు. అలాగే సింగరేణి పాటల్లో
వేసుకున్న కలర్ ఫుల్ డ్రసెస్
తన లైఫ్ లో వేసుకోలేదని
అన్నారు. రచ్చ క్యారెక్టర్ స్కెచ్
వేసి మరీ చూపించాడని దర్సకుడుని
మెచ్చుకున్నాడు. దర్శకుడు చాలా క్లారిటీతో ఉండటం
వల్లే చాలా ఈజీ అయ్యిందని
చెప్పుకొచ్చుకొచ్చారు. తన సక్సెస్ సూత్రం
ఎక్కువ ప్రెజర్,స్ట్రెస్ తీసుకోకపోవటమే అని అన్నారు. ఈ
రోజు సౌత్ సినిమా వైపు
ఎంతలా బాలీవుడ్ ఆసక్తిగా చూస్తోందో జంజీర్ షూటింగ్ లో అర్దమైందని చెప్పుకొచ్చారు.
ట్రైన్
ఎపిసోడ్స్ గురించి చెపుతూ...కారు కేబుల్ కట్
అవ్వటం వల్ల...అప్పుడు సమస్య ఎదురైంది. దూకేసి
సేవ్ అయ్యాను అన్నారు. ఒక ట్రైన్ నుంచి
మరో ట్రైన్ మీదకు జంప్ చేయటం
వెరీ గుడ్ ఎక్సపీరియన్స్ అన్నారు.
అప్పుడు ఎదురైన ప్లాబ్లంని ఎవరిమీదకు తొయ్యలేమని,అలాంటివి అప్పుడప్పుడూ జరుగుతూనే ఉంటాయని అన్నారు. ఇక ప్రస్తుతం రామ్
చరణ్ ...ఎవడు రెగ్యులర్ షూటింగ్
లో పాల్గొంటున్నారు.
రామ్
చరణ్ తేజ,వంశీ పైడిపల్లి
కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక
చిత్రం 'ఎవడు'. ఈ చిత్రం తాజా
షెడ్యూల్ హైదరాబాద్లో ప్లాన్ చేశారు.
క్రిందట నెల 27 నుంచి మొదలయిన ఈ
షెడ్యూల్ లో ప్రధాన పాత్రలకి
సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను షూట్ చేసారు. 'జంజీర్'
సినిమా షూటింగ్ బిజీలో ఉన్న చరణ్, 30వ
తేదీ నుంచి 'ఎవడు' షూటింగ్లో
పాల్గొన్నారు. ఆరోజు నుంచి సమంతా,రామ్ చరణ్ కాంబినేషన్లోని
కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
డైలాగ్
కింగ్ సాయికుమార్ ఈ చిత్రంలో రామ్
చరణ్ కి విలన్ గా
మారారు. ఈ చిత్రంలో సమంతను
లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ
చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
ఇందులో సమంతతో పాటు సెకండ్ హీరోయిన్గా బ్రిటిష్ మోడల్
అమీ జాక్సన్ను కూడా ఎంపిక
చేశారు. ‘మద్రాసు పట్టణం’ అనే సినిమా ద్వారా
భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన
ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత ‘ఏక్ దివానాథా’ అనే హిందీ చిత్రంతో
పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో
కూడా అవకాశం దక్కించుంది. రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా
ఆమెకు తొలి తెలుగు సినిమా
కాబోతోంది.







0 comments:
Post a Comment