ప్రముఖ
సినీ నటుడు మోహన్బాబు
'నటవాచస్పతి' బిరుదును దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా అందుకున్నారు.
టి.సుబ్బరామిరెడ్డి లలిత కళాపరిషత్ నెల్లూరు
శాఖ ప్రారంభాన్ని పురస్కరించుకుని ఆదివారం మోహన్బాబుకు ఈ
బిరుదును ప్రదానం చేశారు. పలువురు సినీ, రాజకీయ, సాహిత్య
ప్రముఖుల సమక్షంలో ఆదివారం రాత్రి స్థానిక కస్తూరిదేవి ప్రాంగణంలో జరిగిన సభలో ఈ శాఖను
ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహన్బాబును ఘనంగా సత్కరించారు. వివిధ
రంగాల్లో సేవలందిస్తున్న కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి మహనీయుడని
అక్కినేని నాగేశ్వరరావు ప్రశంసించారు.
మోహన్బాబు మాట్లాడుతూ నెల్లూరు
అంటే తనకెంతో ప్రాణమంటూ ఇక్కడ తనకు జరిగిన
సన్మానంపై ఆనందం వ్యక్తం చేశారు.
'మా' అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ సుబ్బరామిరెడ్డి అజాతశత్రువు అని, అన్ని రంగాలతో
మంచి సంబంధాలున్నాయని గుర్తు చేశారు. ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు మాట్లాడుతూ
తాను టీఎస్సార్ కళా పరిషత్తులో ప్రధాన
భూమిక పోషించడం ఆనందాయకమన్నారు. నెల్లూరు జిల్లా శాఖ అయిదోదని, అన్ని
జిల్లాల్లోనూ త్వరలో శాఖ ప్రారంభిస్తామని చెప్పారు.
అలాగే ఏ రంగంలోనైనా రాణించగల
సత్తా, విజయం సాధించే నేర్పు
ఉన్న ఆయన.. అజాతశత్రువు అని
అక్కినేని అభినందించారు.
సుబ్బిరామిరెడ్డి
మాట్లాడుతూ కళలున్న చోటనే సిరి సంపదలు
వెల్లివిరుస్తాయని చెప్పారు. తాను ఎన్ని రంగాల్లో
రాణించినా.. కళలతో ప్రేమాభిమానాలు, ఆరాధన
వదలబోనని సేవ ద్వారానే గుర్తింపు
పొందాలనేది తన జీవితాశయమన్నారు. తన
చిన్నప్పుడే బాబాయ్ దొడ్ల సుబ్బారెడ్డి నెల్లూరులో
ఆసుపత్రికి స్థలం దానం చేశారని,
అదే తన మనసులో చెరగని
ముద్ర వేసిందని పేర్కొన్నారు. రాజకీయాలకతీతంగా తన లలితకళా పరిషత్తు
ద్వారా అన్ని జిల్లాల్లో సేవా
కార్యక్రమాలు చేపడతానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, దాదాసాహెబ్
ఫాల్కే అవార్డు గ్రహీతలు అక్కినేని నాగేశ్వరరావు, డి.రామానాయుడుతో పాటు,
సినీరంగ ప్రముఖులు మురళీమోహన్, బ్రహ్మానందం, వాణిశ్రీ, జీవిత రాజశేఖర్, అలీ,
తనికెళ్ల భరణి, శ్రద్దాదాస్, అర్చన,
దీక్షాసేథ్,పరుచూరి గోపాలకృష్ణ, పరుచూరి వెంకటేశ్వరరావు, కోడి రామకృష్ణ, మోహన్బాబు కుమార్తె, నిర్మాత
మంచు లక్ష్మీప్రసన్న తదితరులు హాజరయ్యారు. ఎంపీలు లగడపాటి రాజగోపాల్, చింతామోహన్, హర్షకుమార్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సాహితీవేత్త మాడుగుల నాగఫణిశర్మ తదితరులు కూడా హాజరయ్యారు.







0 comments:
Post a Comment