అనంతపురం:
అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన గాలి జనార్దన్ రెడ్డితో
తనకు ఏ విధమైన సంబంధాలు
లేవని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బద్దలు
కొట్టారు. అయితే, ఉప ఎన్నికల్లో ప్రచారాన్ని
గమనిస్తే వారిరువురికి మధ్య సంబంధాలు తెలిసి
వస్తున్నాయని అంటున్నారు. గత కొద్ది రోజులుగా
గాలి జనార్దన్ రెడ్డి అనుచరుడు, బళ్లారి రూరల్ శాసనసభ్యుడు బి
శ్రీరాములు అనంతపురం జిల్లా రాయదుర్గం శానససభా నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి కోసం ప్రచారం సాగిస్తున్నారు.
రాయదుర్గం
నుంచి తాజా మాజీ శానససభ్యుడు
కాపు రామచంద్రా రెడ్డి పోటీ చేయడానికి ఇష్టపడడం
లేదని అంటున్నప్పటికీ ఆయన తరఫున శ్రీరాములు
ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. పైగా, కాపు రామచంద్రా
రెడ్డి గాలి జనార్దన్ రెడ్డికి
చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. బిజెపికి
రాజీనామా చేసిన శ్రీరాములు ఇటీవల
బళ్లారి రూరల్ నుంచి స్వతంత్ర
అభ్యర్థిగా పోటీ చేసి విజయం
సాధించారు. ఆ తర్వాత బిఎస్ఆర్
పార్టీని స్థాపించారు.
బిఎస్ఆర్
అంటే బడవర (పేదలు), శ్రామికర
(శ్రామికులు), రైతర (రైతులు) అనే
అర్థం వస్తుంది. వైయస్సార్ పేరుకు దగ్గరా ఉందని అంటున్నారు. వై
యువతకు, ఎస్ శ్రామికులకు, రైతు
రైతులకు ప్రతినిధ్యం వహించేలా వైయస్సార్ కాంగ్రెసు అని వైయస్ జగన్
తన పార్టీకి పేరు పెట్టుకున్నారు. కడప,
పులివెందుల ఉప ఎన్నికల కోసం
వైయస్ జగన్ సీలింగ్ ఫ్యాన్ను ఎన్నికల గుర్తుగా
ఎంచుకోగా, అదే గుర్తును శ్రీరాములు
ఎంచుకున్నారు.
కాగా,
బళ్లారికి దగ్గరగా ఉండే రాయదుర్గం నియోజకవర్గంలో
బోయ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది.
ఈ సామాజిక వర్గానికి చెందినవారే శ్రీరాములు. దీంతో ఆ వర్గం
మద్దతును వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కూడగట్టడానికి శ్రీరాములు రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీ దిలీప్ రెడ్డిని, కాంగ్రెసు పాటిల్ వేణుగోపాల్ రెడ్డిని పోటీకి దించింది. కాపు రామచంద్రా రెడ్డి
పోటీకి ఇష్టపడని నేపథ్యంలో బోయ సామాజిక వర్గానికి
చెందిన అభ్యర్థిని వైయస్సార్ కాంగ్రెసు నిలబెట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
0 comments:
Post a Comment