అనంతపురం:
సాక్షి మీడియా ఖాతాల స్తంభన నేపథ్యంలో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు.
సాక్షిని మూయించాలని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుతోపాటు ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ9 కుమ్మక్కైనట్లు ఆయన
ఆరోపించారు. ఖాతాలను స్తంభింపజేసి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. జరుగుతున్న దాడులు చూస్తే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. అనంతపురం జిల్లా బొమ్మనహాళ్లో బుధవారం జరిగిన
రోడ్షోలో జగన్ మాట్లాడారు.
తనను
ఒంటరి వాడిని చేసి అణగదొక్కాలని చూస్తున్నారని
ఆక్రోశం వెళ్లగక్కారు. 'సాక్షిని మూయిస్తే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు రాసిందే రాత అవుతుంది. వారు
చెప్పిందే రాష్ట్ర ప్రజలు వినాలని కంకణం కట్టుకుని నాపై
దాడికి పాల్పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని అడ్డం పెట్టుకుని నన్ను
అణచడానికి కుట్ర పన్నుతోంది. ప్రజల
దీవెనలు ఉన్నంత వరకూ ఇలాంటివి ఎన్ని
ఎదురైనా భయపడను' అని జగన్ వ్యాఖ్యానించారు.
టివీ9పై కూడా ఆయన
విరుచుకుపడ్డారు.
సిబిఐని
ఆయన కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా
అభివర్ణించారు. తమపై జరుగుతున్న కుట్రపై
సాక్షి కుటుంబమంతా సమిష్టిగా పోరాడుతుందని ఆయన చెప్పారు. పెట్టుబడులపై
దర్యాప్తునకు, కరెంట్ ఖాతాలకు సంబంధం ఏమిటని ఆయన అడిగారు. పత్రికను
మూసేసి, సిబ్బందిని నిరుద్యోగులు చేయాలని అనుకుంటున్నారా అని ఆయన అడిగారు.
సాక్షిలో ఎవరూ పెట్టుబడులు పెట్టొద్దా,
ఇన్వెస్టర్లతా దిగ్గజాలనని, వారిని తన బినామీలంటారా, వారు
తలుచుకుంటే తననే కొనగొలరని ఆయన
అన్నారు.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన
ఇంటర్వ్యూలో కూడా ఆయన ఈనాడు,
ఆంధ్రజ్యోతి, టీవి9లపై విరుచుకుపడ్డారు.
సాక్షి బూటకపు సంస్థో, కరపత్రికో కాదని ఆయన అన్నారు.
చానెల్, పత్రిక కూడా పెద్ద మీడియా
సంస్థ అని ఆయన అన్నారు.
తాను చట్టానికి కట్టుబడి ఉండే పౌరున్ని అని,
కచ్చితంగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరవుతానని, దేవునిపై తనకు విశ్వాసం ఉందని,
తానేం చేయాలో సరిగ్గా అదే చేస్తున్నానని, ఇచ్చిన
మాటకు కట్టుబడి కాంగ్రెసును వీడినందుకే వేధింపులన్నీ ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment