విద్యాబాలన్
నటించిన ‘ది డర్టీ పిక్చర్’ 114 కోట్లు
వసూలు చేసి బాలీవుడ్ బాక్సాఫీస్ని షాక్ అయ్యేలా
చేసిన సంగతి తెలిసిందే. సిల్స్
స్మిత జీవతం ఆధారంగా రూపొందిన
ఈ చిత్రం తరహాలో మరో చిత్రం కన్నడంలో
రూపొందుతోంది. పాకిస్దాన్ శృంగార నటి వీణా మాలిక్
నటిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు
హాట్ టాపిక్ గా మారింది. ఆ
సినిమా పేరు 'డర్టీ పిక్చర్..
సిల్క్ సకత్హాట్మగ'.
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా
రూపొందుతున్న ఈ చిత్రం ‘ది
డర్టీ పిక్చర్’ నకలు అని ప్రచారం
జరుగుతోంది. అయితే వీణా మాలిక్
దీన్ని కొట్టిపారేస్తోంది.
ఈ విషయమై వీణా మాలిక్ మాట్లాడుతూ...
హిందీ ‘ది డర్టీ పిక్చర్’ కీ మా చిత్రానికి పోలీక
లేదు. మేము సిల్క్ స్మిత
జీవితం రీసెర్చ్ చేసిన స్క్రిప్టుపై పనిచేస్తున్నాం.
నేను ఆ సినిమాని చూసాను.
మా స్క్రిప్టుని చదివాను. ఎక్కడా అస్సలు పొంతన లేదు. అయితే
సిల్క్ స్మిత పాత్రను ఈ
చిత్రంలో చేస్తున్నాను. దర్శక,రచయితలు ఈ
పాత్ర నిమిత్తమై చాలా రీసెర్చ్ చేసారు.
గ్యారెంటీగా మా చిత్రం సిల్క్
అభిమానులును ఆకట్టుకుంటుంది అంది.
అలాగే
'డర్టీ పిక్చర్.. సిల్క్ సకత్హాట్మగ'
సినిమా విడుదల తరువాత తన రాత మారిపోతుందని
వీణామాలిక్ చెప్పారు. ఈ సినిమా ఫోటో
షూట్కోసం బెంగళూరు వచ్చిన
ఆమె మీడీయాతో మాట్లాడారు. 'డర్టీ పిక్చర్...' విడుదల
తరువాత ప్రేక్షకులు అందులో తన పాత్రను మరచిపోరన్నారు.
తాను హిందీ 'డర్టీ పిక్చర్'ను
చూడలేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.
అయితే అందులో నటించిన విద్యాబాలన్ కంటే తన నటన
ఇంకా గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పగలనన్నారు. సిల్క్ స్మిత జీవితం గురించి
చదివానని తెలిపారు.
విద్యాబాలన్
నటించిన ది డర్టీ పిక్చర్
ఇప్పుడు మరో రికార్డుని క్రియేట్
చేసింది. 2011 మెబైల్ వీడియోస్ లో హైయిస్ట్ వ్యూస్
పొందిన చిత్రంగా తేలింది. ఈ మేరకు ఇండిపెండెంట్
వియు క్లిప్ అనే ఇండిపెండెంట్ కంపెనీ
ప్రకటించింది. తమ సర్వేలో ఈ
విషయం వెల్లడైందని ఎక్కువ మంది ది డర్టీ
పిక్చర్స్ లో క్లిప్స్ ను
డౌన్ లోడ్ చేసుకుని మొబైల్
లో వీక్షించారని అన్నారు. ఆ తర్వాత పూనం
పాండే కు ఆ అర్హత
దక్కింది అన్నారు. డర్టి పిక్చర్ ఇప్పటివరకూ
13,24,000 పైగా వీడియో డౌన్ లోడ్ చేసుకున్నారని
వివరించారు. ఇక భాక్సాఫీస్ వద్ద
కూడా ది డర్టీపిక్చర్ చిత్రం
మంచి విజయాన్నే సాధించింది. హిందిలోనే కాక దక్షిణాది భాషల్లోనూ
డబ్బింగ్ అయి విడుదలైన ఈ
చిత్రం మొదటి వారానికే పెట్టిన
పెట్టుబడి సంపాదించి ఆ తర్వాత నుంచి
లాభాల బాటలో పడింది.
0 comments:
Post a Comment