మగధీర’
చిత్రం 1000 రోజులు ప్రదర్శింపబడి
ఆల్ ఓవర్ సౌత్ ఇండియా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది. జులై 31,
2009లో విడుదలైన ఈచిత్రం కర్నూలులోని లక్ష్మి థియేటర్లో 26, ఏప్రిల్ 2012తో 1000 రోజులు
విజయవంతంగా పూర్తి చేసుకుంది.
తాజాగా
ఈచిత్రానికి సంబంధించి 1000 రోజుల పోస్టర్ విడుదల
చేశారు. భవిష్యత్లో ఈ రికార్డు
అధిగమించడం ఎవరితరం కాదేమో! ఏది ఏమైనా మెగా
అభిమానులు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు.
తమ హీరో సాధించిన విజయాన్ని
సగర్వంగా చెప్పుకుంటున్నారు.
రాజమౌళి
దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్
చరణ్ సరసన కాజల్ నటించింది.
ఇది ఒక యాక్షన్ మరియు
ప్రేమ కథ. 400 సం.క్రితం గత
జన్మలొ ప్రేమలో ఓడిపోయిన కాల భైరవ అనే
సైనిక శిక్షకుడు (రామ్ చరణ్) మరియు
యువరాణి మిత్ర విందా దేవి
(కాజల్) మరలా తమ ప్రేమను
గెలిపించుకోవడనికి మళ్ళీ పుడతారు. నాలుగు
శథాబ్ధాల క్రితం ఏమి జరిగింది? మరు
జన్మలో వారు ఎలా కలుసుకొన్నారు?
వారికి ఎదురైన పరిస్థితులు ఏమిటి?- అనేది చిత్ర కథ.
తెలుగు
చలన చిత్ర రంగంలోనే ఈ
చిత్రం అతి పెద్ద విజయంగా
రికార్డును నెలకొల్పినది.223 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న తొలి తెలుగు చలన
చిత్రం ఇదే. ఈ చిత్ర
నిర్మాణ వ్యయం రూ. 40 కోట్లు
దాటినది. బాక్సాఫీసు వద్ద 100 కోట్ల పై చిలుకు
వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ఉపయోగించిన
అత్యున్నత సాంకేతిక పరిజ్ఞ్హానం విమర్శకుల ప్రశంశలను అందుకుంది. ఈ చిత్రంలో రామ్
చరణ్ చేసే గుర్రపు స్వారీ,100
మంది యోధులను సంహరించే సన్నివేశం, ఉదయ్ ఘడ్ లోని
దృశ్యాలు ఎంతో గొప్పగా ఉంటాయి.
షేర్ ఖాన్ గా శ్రీహరి
నటన హైలెట్.
0 comments:
Post a Comment