వైయస్సార్
కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మపైకి జయసుధ
బాణాన్ని ప్రయోగించే ప్రయత్నంలో కాంగ్రెసు నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ రాజశేఖర రెడ్డి
కారణంగానే జయసుధ రాజకీయాల్లోకి వచ్చి
సికింద్రాబాదు నుంచి పోటీ చేసి
శానససభకు ఎన్నికయ్యారు. తొలుత ఆమె వైయస్
జగన్ వెంట నడిచారు. అయితే,
ఆ తర్వాత మెల్లగా కాంగ్రెసు వైపు వచ్చారు. ఈ
స్థితిలో జయసుధ చేత వైయస్
విజయమ్మకు వ్యతిరేకంగా మాట్లాడించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే
కాంగ్రెసు, తెలుగుదేశం మహిళా నేతలు వైయస్
విజయమ్మపై వాగ్బాణాలు విసురుతున్నారు. రేణుకా చౌదరి ఇప్పటికే రంగంలోకి
దిగారు. ఇంకా మరింత మహిళా
నేతలు ముందుకు వచ్చి వైయస్ విజయమ్మను
ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాజ్యసభ
సభ్యురాలు రేణుకా చౌదరితో సమావేశమయ్యారు. ఆ తర్వాత రేణుకా
చౌదరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైయస్ విజయమ్మపై
విరుచుకుపడ్డారు.
గాంధారిలా
వైయస్ విజయమ్మ వ్యవహరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర
మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి వచ్చే నెల 1వ
తేదీ నుంచి రంగంలోకి వస్తారని
అంటున్నారు. వైయస్ విజయమ్మను ఎదుర్కోవడానికి
మహిళా నేతలే సరి అని
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి,
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భావించినట్లు
తెలుస్తోంది. పురంధేశ్వరి వచ్చే నెల 1వ
తేదీ నుంచి ఉప ఎన్నికల
ప్రచారంలోకి దిగనున్నారు.
వైయస్
విజయమ్మ కుమారుడు వైయస్ జగన్ స్థానంలో
ఉప ప్రచారంలోకి దిగడంతో మహిళా నేతలను పెద్ద
యెత్తున తెలుగుదేశం పార్టీ కూడా రంగంలోకి దింపే
ప్రయత్నంలో ఉంది. ముఖ్యమంత్రి పరిటాల
రవి సతీమణి పరిటాల సునీతను ఎన్నికల ప్రచారంలోకి దింపే యోచనలో తెలుగుదేశం
పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
ఉన్నట్లు తెలుస్తోంది. విజయమ్మ తల్లి బాధ్యతను సరిగా
నిర్వర్తించలేదనేది వారి ప్రధాన ఆరోపణగా
ముందుకు వస్తోంది.
0 comments:
Post a Comment