ఉడికించని,
ఆర్గానిక్ లేదా ప్రాసెస్ చేయబడని
మన రోజు వారీ ఆహారం
‘ఉడికించని లేదా పచ్చి ఆహారం’ గా పరిగణించాలి. పచ్చి ఆహారం తినటంలో
వాస్తవం ఏమంటే...ఉడికిస్తే ఆహారంలోని పోషక విలువలు, ఎంజైములు
పోతాయనేది. మరి కూరగాయలవంటి ఆహారంలోని
పోషకాలు వండితే పోతాయి. కనుక వాటిలోని పోషకాలు
పోకుండా పూర్తి విలువలుకల పచ్చి ఆహారం కొరకు
ఏ ఏ ఆహారాలు మీ
డైట్ లో చేర్చాలనేది పరిశీలించండి.
పండ్లు,
కూరగాయలు - పండ్లు, కూరగాయలలో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు, ఇతర పోషకాలు అధికంగా
వుంటాయి. ఏ పచ్చి ఆహారానికైనా
సరే ఇవే ప్రధానంగా వుంటాయి.
కేలరీలు తక్కువగా వుండటం వలన, నీరు అధికంగా
వుండటం వలన అవి మన
ఆరోగ్యాన్ని శరీర పటుత్వాన్ని కలిగిస్తాయి.
ఆపిల్, అరటిపండు వంటి పండ్లు, పచ్చని
ఆకు కూరలు, కేరట్లు, బెర్రీలు, బ్రక్కోలి, సెలిరీ, ముల్లండి, మామిడిపండ్లు, పైన్ ఆపిల్స్ వంటివి
పచ్చి ఆహారంలో తప్పక చేర్చండి. అవి
పచ్చిగా వున్నపుడే అధిక ప్రయోజనం చేకూరుస్తాయి.
డ్రై
ఫ్రూట్లు, విత్తనాలు - డ్రై ఫ్రూట్లు, మొలకెత్తిన
విత్తనాలు లో ప్రొటీన్లు, పీచు
అధికంగా వుంటాయి. బాదం పప్పులు, వేరు
శనగ పప్పులు,పిస్తా, వాల్ నట్స్, సొరకాయగింజలు,
నువ్వులు, మెంతులు వంటివాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు,ఇతర అత్యవసర నూనెలు
వుంటాయి. వీటినిసాయంకాలాలు పచ్చిగానే తినేయవచ్చు. కూరలు, పండ్లకు మరి కొన్ని సహజ
పదార్ధాలుచేర్చి తినవచ్చు.
మూలికలు,
సుగంధ ద్రవ్యాలు, పోపులు - ప్రాసెస్ చేయని మూలికలు, సుగంధద్రవ్యాలు
అయిన దాల్చినచెక్క, లవంగం, అల్లం, వెల్లుల్లి, నల్ల మిరియం వంటివి
కూడా తేలికగా ఎలా వున్నవి అలా
తినేయవచ్చు. ఆవాలు లేదా మెంతులు,
జీలకర్ర వంటివి కూడా తినవచ్చు.
పాలు,
పాల ఉత్పత్తులు - పాలు, మజ్జిగ, వెన్న
నెయ్యి, గుడ్లు, జున్ను, పెరుగు వంటివి కూడా మీరు పచ్చి
ఆహార జాబితాలో చేర్చుకోవచ్చు. అవి కూడా ఆరోగ్యాన్ని
ఇచ్చి మీ కవసరమైన శక్తినిస్తాయి.
అయితే, అనారోగ్యాలు కలుగకుండా మీ దేహానికి ఏది
సరిపోతుందనే దానిపై మీరు అవగాహన కలిగి
వీటిని తినవలసి వస్తుంది.
పానీయాలు
- కాఫీ, టీ, ఆల్కహాల్, సోడా
ల వంటివి పచ్చి ఆహారంగా పరిగణించబడవు.
అయితే, కొబ్బరి బొండాం నీరు, పండ్లు, కూరగాయల
రసాలు, సూప్, మొదలైనవి మీ
పచ్చి ఆహారం జాబితాలో చేర్చి
రుచికరంగా తాగేయవచ్చు.
ఇతర ఆహారాలు - పైన తెలిపిన ఆహారాలు
కాక, మరి కొన్ని అయిన
సహజ ఆహారాలు అంటే తేనె, బెల్లం,
నిమ్మ రసం వంటివి కూడా
మీ ఉడికించని లేదా పచ్చి ఆహార
రజాబితాలో చేర్చుకొని వాటి ప్రయోజనాలు పూర్తిగా
పొందవచ్చు.
పచ్చి
ఆహారం అద్భుత ప్రయోజనాలనిస్తుంది. పచ్చి ఆహారం వ్యయం
రీత్యా తక్కువే. కాని మంచి పోషకాలు
కలిగి ఉడికించిన ఆహారం కంటే కూడా
అధిక మేలునిస్తుంది. తేలికగా జీర్ణం అవుతుంది. వయసు పైబడకుండా చేస్తుంది.
చర్మ కాంతి కలిగిస్తుంది. ఈ
ఆహారంలో పోషకాలు బాగా వుంటాయి కనుక
శరీరానికి అవసరమైన రోగనిరోధక వ్యవస్ధను బలపరచి, కేన్సర్, డయాబెటీస్, గుండె జబ్బులు, ఎలర్జీలు,
వంటి అనారోగ్యాలు దరి చేరకుండా చేస్తుంది.
ఆరోగ్యకరంగా
తినండి. ఆరోగ్యం కాపాడుకోవటానికే కాదు, మీ భవిష్యత్
ఆరోగ్యానికి, మీ కుటుంబ సభ్యుల
ఆరోగ్యానికి మీ పచ్చి ఆహారం
ఎంతో మేలు చేస్తుందని గుర్తించండి.
0 comments:
Post a Comment