యంగ్
టైగర్ జూ ఎన్టీఆర్ బాలీవుడ్
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్
ఖాన్ను ఫాలో అవుతున్నాడా?
అతనిలా మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఇమేజ్
కోసం ప్రయత్నిస్తున్నాడా? అంటే అవుననే సమాధానం
వినిపిస్తోంది సినీ వర్గాల నుంచి.
సినిమా సినిమాకు జూనియర్ తనను తాను కొత్తగా
ప్రజంట్ చేసుకోవడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు.
ప్లాపులు,
హిట్లు అనే సంగతి పక్కన
పెడితే ఈ మధ్య జూ
ఎన్టీఆర్ హీరోగా వస్తున్న సినిమాలన్నీ వైవిద్యంగానే ఉంటున్నాయి. బృందావనం సినిమా ముందు ఉన్న ఎన్టీఆర్
బృందావనం తర్వాత మనం చూస్తున్న ఎన్టీఆర్‍లో చాలా తేడాలు
వచ్చాయి. శక్తి సినిమాతో వారియర్
అవతారం ఎత్తాడు. తాజాగా దమ్ము చిత్రంలో తన
పెర్ఫార్మెన్స్ పరంగా అందరినీ ఆకట్టుకున్నాడు.
త్వరలో
జూనియర్ ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రాబోతున్న
‘బాద్ షా’ సినిమాలో యంగ్ టైగర్ మరింత
సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్
బాడీ లాంగ్వేజ్, స్టయిల్ పూర్తిగా మార్చేసి చూపించబోతున్నాడు దర్శకుడు శ్రీను వైట్ల. కెరీర్లో వరస హిట్లు కొట్టిన
తర్వాత కొన్ని పూర్తి సందేశాత్మక, అవార్డ్ ఓరియెండ్, విమర్శకుల ప్రశంసలు అందుకునే చిత్రాల్లో నటించాలనే ప్లాన్ కూడా ఉందట ఈ
యువ హాట్రోబ్కి.







0 comments:
Post a Comment