పవర్
స్టార్ పవన్ కళ్యాణ్కు
సంబంధించిన మరో భారీ ప్రాజెక్టు
ఓకే అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్న
ఈచిత్రాన్ని బండ్ల గణేష్ శ్రీ
పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బేనర్పై నిర్మించనున్నట్లు
వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల
రచయిత కోన వెంకట్ ద్వారా
పవర్ స్టార్ కథ విని...సినిమాకు
గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. శీను వైట్ల మార్కుతో
సాగే యాక్షన్ ఎంటర్ టైనర్గా
ఈచిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇందుకు సంబంధించిన
అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఈ కాంబినేషన్
పై అభిహానుల్లో భారీ అంచనాలున్నాయి.
ప్రస్తుతం
శ్రీను వైట్ల జూ ఎన్టీఆర్
హీరోగా ‘బాద్ షా’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాన్ పూరి
జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రానికి కమిట్ అయ్యారు. ఈరెండు
చిత్రాలు పూర్తియిన తర్వాత పవన్-శ్రీను చిత్రం
మొదలయ్యే అవకాశం ఉంది.
ప్రస్తుతం
పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం మే 11న భారీగా
విడుదల కాబోతోంది. హరీష్ శంకర్ దర్శకత్వం
వహించిన ఈచిత్రంపై అంచనాలు ఆకాశాన్నంటాయి. పవన్ సరసన శృతి
హాసన్ నటించగా, బండ్ల గణేష్ ఈచిత్రాన్ని
నిర్మించారు.







0 comments:
Post a Comment