స్టయిల్
స్టార్ అల్లు అర్జున్, క్రేజీ
డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘జులాయి’ చిత్రం దాసరి చేతుల్లోకి వెళ్లి
పోయింది. ఈచిత్రానికి సంబంధించిన ఏపీ థియేట్రికల్ రైట్స్
దాసరికి సంబంధించిన ‘సిరి మీడియా’ భారీ మొత్తం చెల్లించి
దక్కించుకున్నట్లు తెలుస్తోంది.
''జీవితాన్ని
తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ
తిరుగుతుంది. జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు.
పరుగులు తీసే వయసులో చదువు,
ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు
బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక
పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే
జోష్ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది
ఆ కుర్రాడి సిద్ధాంతం.
ఈ చిత్రం గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ...ఎప్పటికప్పుడు నటుడిగా కొత్తదనం చూపించాల్సిందే. పాత్రల ఎంపికపరంగానూ జాగ్రత్తలు తీసుకొంటున్నాను. అందులో భాగంగానే సిక్స్ ప్యాక్ చేశాను. కేశాలంకరణలు మార్చాను. ఏం చేసినా... నా
అభిమానుల్ని అలరించేలా అంశాలు ఉండేలా చూసుకొంటాను అన్నారు.
ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన
ఇలియాన నటిస్తోంది. వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్ శైలి సంభాషణలు, అర్జున్
నృత్యాలు అలరిస్తాయి. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్,
సోనుసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,
తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు.
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత: రాధాకృష్ణ, బ్యానర్: హారిక అండ్ హాసిని
క్రియేషన్స్, సమర్పకులు: డి వివి దానయ్య.







0 comments:
Post a Comment