క్రియేటివ్
దర్శకుడు కృష్ణ వంశీ ప్రస్తుతం
నాని హీరోగా ‘పైసా’ చిత్రం రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో
నాని యంగ్ పొలిటీషియన్గా
కనిపించబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈచిత్రం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షుడు జగన్ను టార్గెట్
చేస్తూ రూపొందిస్తున్నారనే వార్తలు గుప్పుమన్నాయి.
అయితే
ఈవార్తలపై ఎట్టకేలకు దర్శకుడు కృష్ణ వంశీ స్పందించారు.
ఈచిత్రం జగన్కు వ్యతిరేకం
ఏమాత్రం కాదని, ఎవరిని ఉద్దేశించి ఈచిత్రం తీయడం లేదని స్పష్టం
చేశారు. రాజకీయాల నేపథ్యంలోనే సినిమా ఉంటుందని, యంగ్ పొలిటిషీయన్ గా
హీరో పాత్ర ఆదర్శ వంతంగా
ఉంటుందని చెప్పుకొచ్చారు. ఎల్లోఫ్లవర్స్ సంస్థ ఈ చిత్రాన్ని
మంచి నిర్మాణ విలువలతో నిర్మిస్తోంది. ఈ సినిమాలో కేథరీన్
హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం
హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ సాగుతోంది. గతంలో మిరపకాయ నిర్మించిన
రమేష్ పుప్పాల నిర్మాత.
ఇక గోపీచంద్ మొగుడు తర్వాత కృష్ణవంశీ చేస్తున్న చిత్రం ఇదే. ఆ చిత్రం
డిజాస్టర్ కావటంతో కొంత గ్యాప్ తీసుకుని
ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదట ఈ చిత్రానికి
పైసాలో పరమాత్మ టైటిల్ అనుకున్నారు. ఆ తర్వాత జెండాపై
కపిరాజు అని వార్తలు వచ్చాయ.
అయితే పైసాలో పరమాత్మ టైటిల్ వేరే వారు తమ
సినిమాకు పెట్టుకుని ఉండటంతో పైసా టైటిల్ ని
ఈ చిత్రానికి ఫిక్స్ చేసారు.
జగన్
అరెస్టు గురించి రాష్ట్రంలో హాట్ హాట్ చర్చ
సాగుతున్న నేపథ్యంలో కృష్ణ వంశీ ఈ
ప్రకటన చేయడం ద్వారా అందరి
దృష్టిని తన వైపుకు తిప్పుకున్నారు.
జగన్కు, తన సినిమా
స్టోరీకి సంబంధం లేదని చెబుతున్న కృష్ణ
వంశీ తన సినిమాలో ఏం
చూపించబోతున్నారో చూద్దాం...







0 comments:
Post a Comment