కింగ్
నాగార్జున, సౌత్ హాట్ లేడీ
నయనతార మరోసారి కలిసి రొమాన్స్ చేయబోతున్నారు.
దశరథ్ దర్శకత్వంతో నాగార్జున, నయనతార జంటగా రూపొందుతున్న ‘లవ్
స్టోరీ’
చిత్రం జూన్ మూడో వారంలో
షూటింగు ప్రారంభం కాబోతోంది. కామాక్షి ఎంటర్ ప్రైజెస్ అధినేత
శివప్రసాదరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ చిత్రంలో నటించడానికి నయనతారకు అత్యధిక మొత్తంలో పారితోషికాన్ని చెల్లించినట్టు ఆమధ్య వార్తలు కూడా
వచ్చాయి. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయింది.
తమన్ సంగీతం సమకూర్చుతున్నారు. 'మిస్టర్ పెర్ఫెక్ట్' హిట్ తర్వాత దశరద్
చేస్తున్న చిత్రం ఇదే! ప్రస్తుతం చేస్తున్న
'శిరిడి సాయి' చిత్రం తర్వాత
నాగార్జున ఈ చిత్రం షూటింగులోనే
పాల్గొంటారు. ఇక నాగార్జున, నయనతార
గతంలో 'బాస్' చిత్రంలో కలిసి
నటించిన సంగతి మనకు తెలిసిందే!
గతంలో నాగార్జున, దశరథ్ కలయికలో 'సంతోషం'
చిత్రం రూపొందింది.
ప్రస్తుతం
నాగార్జున ...శ్రీనివాస రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన ‘డమరుకం’ చిత్రం
ఒక పాట మినహా చిత్రీకరణ
పూర్తయింది. పోస్టు ప్రొడక్షన్ పనులు జగుతున్నాయి. జూలై
రెండో వారంలో సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు.
ఢమురుకం
చిత్రంలో నాగార్జున ఆటో డ్రైవర్ గా
చేస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్
శివుడుగా కనిపించనున్నారు. ఇక అనూష్క దైవ
శక్తులున్న పార్వతి అంశతో పుట్టిన అమ్మాయిగా
మైతిలాజికల్ పాత్రలో కనిపిస్తోంది. ఇక రక్త చరిత్రలో
చేసిన అభిమన్యు సింగ్ ఇందులో విలన్
గా కనిపించనున్నారు. దైవ శక్తికీ, దుష్ట
శక్తికీ జరిగే పోరాటమే ఈ
చిత్రం కథ అని తెలుస్తోంది.







0 comments:
Post a Comment