హైదరాబాద్/నల్గొండ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని
ఏమైనా అంటే తాను ఊరుకునేది
లేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి
వెంకట రెడ్డి బుధవారం నల్గొండ జిల్లాలో విలేకరులతో అన్నారు. తాను వైయస్ రాజశేఖర
రెడ్డికి రాజకీయ శిష్యుడిని అని కోమటిరెడ్డి మరోమారు
స్పష్టం చేశారు. తెలంగాణ ప్రకటిస్తేనే పరకాల ఉప ఎన్నికలలో
గెలుస్తామని ఆయన స్పష్టం చేశారు.
2014 వరకు
తెలంగాణ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం
చేశారు. ఒకవేళ కాంగ్రెసు అప్పటి
వరకు కూడా తెలంగాణ రాష్ట్రం
ఇవ్వకుంటే కాంగ్రెసు పతనం ఖాయమన్నారు. కొంతమంది
పార్టీ నేతలు పదవుల కోసం
తెలంగాణవాదాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
మరో మాజీ మంత్రి శంకర
రావు హైదరాబాదులో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి
తనయుడిపై ఘాటైన విమర్శలు చేశారు.
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో
హోంమంత్రి తనయుడి హస్తం ఉందని ఆరోపించారు.
సూరి మర్డర్ ప్లాన్ హోంమంత్రి ఇంట్లోనే జరిగిందని ఆయన విమర్సించారు.
ఉప ఎన్నికలలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి
మంచి అభ్యర్థులను ఎంపిక చేశారని కితాబిచ్చారు.
అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రులను ఉప ఎన్నికలకు ముందే
పక్కకు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
వారిని
పక్కకు పెడితేనే కాంగ్రెసుకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
ఉప ఎన్నికలలో తనను ప్రచారానికి వినియోగించుకుంటే
మరిన్ని ఎక్కువ ఓట్లు పడతాయని ఆయన
చెప్పారు. గెలుపోటములు ప్రభుత్వ నాయకత్వంపై ఆధారపడి ఉంటాయని చెప్పారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసు
అంశాన్ని సిబిఐచే విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.
అలా అయితేనే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు.
0 comments:
Post a Comment