హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర
రావు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ శ్రీవారి పర్యటన
వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీనిపై
దాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి
కుటుంబానికి హిందూమతంపై తీవ్ర వ్యతిరేకత ఉందని
ఆరోపించారు. డిక్లరేషన్ ఫాం పైన సంతకం
పెట్టకుండా జగన్ లోనికి వెళ్లడం
సరికాదన్నారు.
బయట చూపిస్తున్నట్లుగానే జగన్ దేవుడిపై కూడా
జులుం చూపిస్తున్నారని మండిపడ్డారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని వైయస్ జగన్ కుట్ర
చేస్తున్నారని ఆరోపించారు. దౌర్జన్యంగా ఆలయంలోకి వెళ్లడమేమిటని ఆయన ప్రశ్నించారు. అన్యమతస్తులు
డిక్లరేషన్ పై సంతకం చేయాలన్న
సంప్రదాయాన్ని జగన్ ధిక్కరించడం దారుణం
అన్నారు. ఓ వర్గం ప్రజలను
జగన్ దెబ్బ తీశారని విమర్శించారు.
తిరుమల పవిత్రత దెబ్బతీసేలా వ్యవహరించిన వైయస్ రాజశేఖర రెడ్డి
ఆ తర్వాత ఫలితాన్ని అనుభవించారని అన్నారు.
కాగా
హంతకులు రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రజల పైనే ఉందని
బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి అన్నారు. అమేథిలో చతికిలపడ్డ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ముఖ్యమంత్రి కిరణ్
కుమార్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేయడం దారుణం
అని మరో నేత లింగారెడ్డి
అన్నారు.
జగన్
అరెస్టుకు సిబిఐ మీనమేషాలు లెక్కిస్తోందని
మరో నేత గాలి ముద్దుకృష్ణమ
నాయుడు అన్నారు. జగన్ను అరెస్టు
చేయకపోవడంపై సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సమాధానం చెప్పాలని
డిమాండ్ చేశారు. సోనియా ఆదేశాల మేరకే జగన్ను
అరెస్టు చేయడం లేదని ఆయన
అనుమానం వ్యక్తం చేశారు.
జాతీయ
స్థాయిలో యుపిఏకు మద్దతిస్తానని జగన్ ప్రకటించాకే ఆయనపై
కేసు నీరుగారుతూ వస్తోందని అన్నారు. ఎ-1ను ఎందుకు
అరెస్టు చేయరని పలుమార్లు కోర్టే ప్రశ్నించిందన్నారు. బోఫోర్స్ కుంభకోణం నుంచి ఇప్పటి వరకు
జరిగిన ప్రతి అవినీతి, కుంభకోణాల్లో
సోనియా పాత్ర ఉందని ఆరోపించారు.
నేరపూరిత రాజకీయాలకు ఆజ్యం పోసింది వాటిని
పెంచి పోషించిందిన వైయస్ రాజశేఖర రెడ్డే
అన్నారు.
0 comments:
Post a Comment