మామిడి
పళ్ళు ఎంతో రుచికరం. కనుకనే
దానిని పండ్లలో రారాజు అని పిలుస్తాం. నోరూరించే
ఈ వేసవికాల పండు వివిధ రకాలుగా
తినవచ్చు. దీనితో తీపి, పులుపు, రుచుల
వంటకాలు చేసుకోవచ్చు. మీరు మామిడిపండు ప్రియులైతే
ఈపండు మీ శరీరానికి ఎంతో
ఆరోగ్యకరంఅని తెలుసుకోండి. మామిడిపండులో, ఎన్నో విటమిన్లు, పీచు,
మినరల్స్ వుంటాయి. చాలామంది మామిడిపండు బరువు పెంచుతుందని భావిస్తారు.
కాని ఆఫ్రికా మామిడిపండ్లు శరీర బరువు తగ్గిస్తాయని
మీకు తెలుసా? మరి ఈ ఆఫ్రికా
మామిడిపండ్లు అవి బరువు తగ్గేందుకు
ఎలా సహకరిస్తాయనేది పరిశీలించండి.
ఆఫ్రికా
మామిడిపండు సాధారణ మామిడిపండు కంటే భిన్నంగా వుంటుంది.
అనేక దశాబ్దాలనుండి ఆఫ్రికా మామిడి పండ్లు బరువు తగ్గేందుకు సహజ
ఆహారంగా వాడుతున్నారు. చాలామంది పోషకాహార నిపుణులు బరువు తగ్గేందుకు ఆఫ్రికా
మామిడిపండ్లను తినమని సిఫార్సు చేస్తారు. తింటే ఇవి ఎంతో
సురక్షితం, చెడు దుష్ప్రభావాలు అసలే
వుండవు.
ఆఫ్రికా
మామిడి పండ్ల ఆరోగ్య ప్రయోజనం
ప్రధానంగా దాని విత్తనాలనుండి వస్తుంది.
అంటే టెంకనుండి వస్తుంది. దీని టెంకలో కావలసినంత
పీచు, కొవ్వులు వుండి అవి అధిక
బరువు కరిగించేస్తుంది. ఆకలిని లెప్టిన్ అనే పదార్ధం ఎప్పటికపుడు
నియంత్రిస్తుంది. అది దీనిలో వుండటం
చేత, ఆకలి మందగించి, కేలరీలు
అధికంగా ఖర్చయ్యేలా చేస్తుంది. కొల్లెస్టరాల్ దీనిలో చాలా తక్కువ. దీనిలో
వుండే అడిపోనెక్టిన్ అనే పదార్ధం ఇన్సులిన్
ఉత్పత్తి అధికం చేస్తుంది. అది
కొవ్వును శక్తిగా తక్షణమే మారుస్తుంది.
బరువును
తగ్గించటమేకాక, వ్యాధులు రాకుండా చేస్తుంది. మనలోని జీవక్రియ వేగవంతం చేస్తుంది. కఠిన ఆహారం పాటించకుండా
వర్కవుట్లు చేయకుండా బరువు తగ్గాలనే వారికి
ఆఫ్రికా మామిడిపండ్లు తినటం మంచి మార్గం.
ఏ మందులు వాడకుండా బరువు సహజంగా తగ్గాలంటే,ఆఫ్రికా మామిడిపండు ఎంతో ప్రయోజనం.
మామిడిపండ్ల
ఆరోగ్యప్రయోజనాలు మరిన్ని.....
1. ఎసిడిటీ
వుంటే మామిడిపండు సహజ నివారణ కలిగిస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరిచే ఎంజైములు వున్నాయి.
2. మొటిమలు
తగ్గేందుకు ఒక మామిడిపండు రసాన్ని
మీ ముఖంపై రుద్దితే చర్మంలోని రంధ్రాలు బాగా శుభ్రపడి మొటిమలు
వెంటనే తగ్గుతాయి.
3. మామిడిపండు
కొల్లెస్టరాల్ లెవెల్ తగ్గిస్తుంది. దీనిలో వుండే కరిగే పీచు,
విటమిన్ సి మరియు పెక్టిన్
లు కొల్లెస్టరాల్ స్ధాయి నియంత్రిస్తాయి.
4. రెగ్యులర్
గా కనుక దీనిని తింటే,
దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కేన్సర్,
డయాబెటీస్, గుండెజబ్బులకు కారణమయ్యే క్రిములను తొలగిస్తాయి.
మంచి
రుచి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
కల ఈ మామిడిపండును తినటం
నేడే ప్రారంభించండి.
0 comments:
Post a Comment