నారా
రోహిత్ హీరోగా గులాబీ మూవీస్ పై సి.వి.రెడ్డి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఒక్కడినే'.
నిత్యామీనన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ
చిత్రంలో కథ...సూర్య అనే
యువకుడికీ ఓ ప్రవాసాంధ్ర యువతికీ
మధ్య సాగే ప్రేమ..వాటి
మూలంగా వచ్చే సమస్యలుగా జరుగుతుంది.
నేడు మన కుటుంబాల్లో జరిగేటువంటి
అనుబంధాల్ని టచ్ చేస్తూ నిర్మిస్తున్న
కుటుంబ కథా చిత్రమిది.
ఈ కథ గురించి నిర్మాత
సివీ రెడ్డి మాట్లాడుతూ...ప్రేమంటే రెండు మనసుల కలయిక.
నిదురలోనైనా, మెలకువలోనైనా... ఆ మధురమైన జ్ఞాపకాలే
తోడుగా ఉంటాయి. ప్రేమ మొగ్గ తొడిగిందంటే
ఒంటరి జీవితానికి వీడ్కోలు పలికిట్టే లెక్క. కానీ ఓ యువకుడికి
మాత్రం అందుకు భిన్నమైన అనుభవాలు ఎదురయ్యాయి. ప్రేమలోపడిన తరవాతే అతను ఒంటరిగా మిగిలాడు.
ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే
అన్నారు. మా దర్శకుడు శ్రీనివాస్
రాగ ఎక్కడా, దేనికీ రాజీపడకుండా చిత్రీకరించారు. తప్పకుండా ఇది ఇంటిల్లిపాది మెచ్చేటువంటి
అపురూప కథా చిత్రం అవుతుందని
నా నమ్మకం.
ఈ సినిమాపై అంచనాలు అదికంగా బాగా ఉన్నాయి. దీనికి
కారణం నారా రోహిత్ చేసిన
‘సోలో’,
నిత్యామీనన్ తాజాగా నటించిన ‘ఇష్క్’ చిత్రాలు. ఈ రెండూ విజయవంతం
కావడం, వాటిల్లోని హీరో, హీరోయిన్లు కలిసి
తొలిసారి ఇందులో జంటగా నటించడం వల్ల
ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. టైటిల్‌కు తగ్గ కథ
ఇది. చక్కని లవ్ డ్రామా ఉంది.
ఇప్పటికే మార్కెట్ లో ఈ చిత్రానికి
మంచి క్రేజ్ వచ్చినట్లు చెప్తున్నారు. ఆడియో సైతం త్వరలో
విడుదల చేసి పబ్లిసిటీ ప్రారంభించనున్నారు.
ఈ చిత్రంతో తాను కమర్షియల్ హీరోగా
నిలదొక్కుకునేందుకు నారా రోహిత్ ప్రయత్నిస్తున్నారు.
నిత్యా మీనన్ ఈ చిత్రానికి
ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
ఏప్రిల్
29న రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలైన మూడో షెడ్యూల్ మే
26 వరకు జరిగింది. దీనితో క్లైమాక్స్, 3 పాటలు చిత్రీకరణ మినహా
మొత్తం సినిమా అయిపోయింది. ఇక పాటల్ని క్లైమాక్స్‌ని జూన్ నెలలోనే
పూర్తిగావిస్తారు. శబ్దాలయా థియేటర్లో జూన్ 4 నుంచి
డబ్బింగ్ పనుల్ని మొదలుపెడుతున్నారు.
నారా
రోహిత్ సరసన నిత్యామీనన్ నటిస్తున్న
ఈ చిత్రంలో నాగబాబు, చంద్రమోహన్, సాయికుమార్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం,
యం.యస్.నారాయణ, బెనర్జీ,
జీవి, ఆలీ, శ్రీనివాసరెడ్డి, సత్యకృష్ణ,
సుధ, ఢిల్లీ రాజేశ్వరి ముఖ్యపాత్రల్ని చేసారు. ఈ చిత్రానికి మాటలు:
చింతపల్లి రమణ, సంగీతం: కార్తీక్,
ఛాయాగ్రహణం: ఆండ్రుబాబు, కళ: నాగేంద్ర, ఎడిటింగ్:
మార్తాండ్ కె.వెంకటేష్, కో-డైరెక్టర్: కళ్యాణ్, ప్రొడక్షన్: తాండవకృష్ణ పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు. నిర్మాత: సి.వి.రెడ్డి,
కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్
రాగ.
0 comments:
Post a Comment