పవన్
కళ్యాణ్ తాజా చిత్రం గబ్బర్
సింగ్ లో యంగ్ హీరో
నితిన్ నటిస్తున్నాడంటూ వార్తలు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సంగతి
తెలిసిందే. అయితే తాజాగా మరో
వార్త వెలుగులోకి వచ్చింది. గన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల పాటలో నితిన్
కొద్దిసేపు స్టెప్స్ వేసి అలరించనున్నాడని సమాచారం.
పవన్ లాంటి స్టార్ సినిమాలో
నితిన్ డాన్స్ కు ప్రత్యేకమైన ఇంపార్టెన్స్
లేకపోయినా నితిన్ కోరిక మేరకు ఇలా
చేసాడని చెప్పుకుంటున్నారు. యూనిట్ మాత్రం నితిన్ ఎంట్రీ సర్పైజింగ్ గా ఉంటుందని అంటున్నారు.
దాన్ని కేవలం తెరపైన మాత్రమే
చూడాలని అప్పటివరకూ సీక్రెట్ గా ఉంచాలని దర్శక,
నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. అయితే ఆ మధ్యన
నితిన్ తాజా చిత్రం ఇష్క్
ఆడియో ఫంక్షన్ కి సైతం స్పెషల్
గెస్ట్ గా పవన్ కళ్యాణ్
వెళ్లి వచ్చారు.
''దబాంగ్
సినిమాకి రీమేక్ అయినా... తెలుగు వాతావరణానికి, పవన్ కళ్యాణ్ శైలికి
అనుగుణంగా చాలా మార్పులు చేశాం.
గన్నులాంటి పాత్రను ఆయన పోషించారు. 'గబ్బర్
సింగ్'గా పవన్ హావభావాలు,
నటన ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి'' బండ్ల
గణేష్ అన్నారు. పవన్ కళ్యాణ్, శృతి
హాసన్ జంటగా పరమేశ్వర ఆర్ట్
ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘గబ్బర్ సింగ్’.
హరీష్ శంకర్ ఎస్ దర్శకత్వంలో
బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని
నిర్మించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం పోస్ట్
ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత
గణేష్బాబు మాట్లాడుతూ ఇలా
స్పందించారు.
అలాగే
షూటింగ్ అంతా పూర్తిచేసి, నిర్మాణాంతర
కార్యక్రమాలు జరుపుతున్నామని, మే మొదటివారంలో సెన్సార్
కార్యక్రమాలు పూర్తిచేసి, రెండో వారంలో గ్రాండ్గా విడుదల చేయడానికి
సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తున్న
నేపధ్యంలో ప్రేక్షకుల అంచనాలు పూర్తిగా నిజమవుతాయని ఆయన అన్నారు. ‘‘గుండెజారి
గల్లంతయ్యిందే... తీరా చూస్తే నీ
దగ్గర ఉందే.... నీలో ఏదో తీయని
విషముందే... నా ఒంట్లోకి సర్రున
పాకిందే...’’...ఈ పాటను మొన్ననే
స్విట్జర్ల్యాండ్లో చిత్రీకరించారు. చేతిలోని
గొడుగులు సైతం ఎగిరిపోయే చల్లని
మంచు మలయమారుతాల మధ్య ఆహ్లాదభరితమైన వాతావరణంలో
ఈ పాట చిత్రీకరణ జరిగిందని
కథానాయిక శ్రుతిహాసన్ చెప్పారు. షూటింగ్ పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోందీ సినిమా.
ఇక దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ...
నేరగాళ్లను కటకటాల్లోకి నెట్టేందుకు చట్టాలు, నిబంధనలూ ఉంటాయి. అయితే ఆ పోలీసాయన
మాత్రం తనకంటూ ఓ చట్టం రాసుకొన్నాడు.
దాని ప్రకారమే పని చేస్తాడు అతగాడి
కథేమిటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే
అన్నారు. అలాగే ఇందులో పవర్స్టార్ కేరక్టరైజేషన్ అభిమానులు పండగ చేసుకునే విధంగా
ఉంటుంది. ‘గబ్బర్సింగ్’గా కొత్త పవన్కళ్యాణ్ని చూస్తారు. పవర్స్టార్ చిత్రాల్లో ‘గబ్బర్సింగ్’ నంబర్‌వన్‌గా
నిలిచే సినిమా అవుతుంది ’’అని నమ్మకం వ్యక్తం
చేశారు. బాలీవుడ్ లో హిట్టైన దబాంగ్
కి ఇది రీమేక్. ఇందులో
పవన్ మాస్ లుక్ తో
కూడిన పోలీస్ అధికారిగా కనపిస్తారు.
0 comments:
Post a Comment