మహేష్
బాబుతో సినిమా చేయాలని చాలా కాలం నుంచి
కథలు చెప్తూ ఎదురు చూస్తున్న దర్శకులలో
ప్రభుదేవా ఒకరు. తాజాగా ఆయనతో
చేయటానికి మహేష్ అంగీకరించారు. అయితే
దర్శకుడుగా కాదు డాన్స్ మాస్టర్
గా అని తెలుస్తోంది. సుకుమార్
దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ప్రభుదేవాని రెండు పాటలకు డాన్స్
మాస్టర్ గా ఎంపిక చేసుకున్నట్లు
సమాచారం. అయితే దర్శకుడుగా బిజీ
అయ్యాక డాన్స్ ని ప్రక్కన పెట్టి
సెలక్టివ్ గా చేస్తున్న ప్రభుదేవా
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటున్నట్లు
చెన్నై టాక్. మహేష్ కి
దగ్గరగా మెలగటం ద్వారా అతన్ని మెప్పించి అతనితో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని
తెలుస్తోంది.
ఇక డాన్స్ ల విషయంలో మహేష్
కి మొదటి నుంచి పెద్ద
పేరు లేదు. అయితే ఈ
చిత్రం ద్వారా మహేష్ ఆ విషయంలో
తన అబిమానులను ఆనందపరచాలనుకుంటున్నారు. అందుకోసం ప్రభుదేవా ప్రత్యేకమైన స్టెప్స్ తో ప్రిపేర్ అవుతున్నాడని
సమాచారం. సుకుమార్ సైతం మహేష్ తో
హిట్ కొడితే పెద్ద స్టార్స్ తో
వరస సినిమాలు చెయ్యవచ్చనే ఆలోచనలో ఈ చిత్రాన్ని ఓ
రేంజిలో తీర్చిదిద్దటానికి రాత్రింబవళ్లూ కష్టపడుతున్నాడని,అందుకోసం ఎక్కడెక్కడి టాప్ టెక్నీషియన్స్ ని
ఎంపికచేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుదేవా..అక్షయ్ కుమార్ తో తాను రూపొందిస్తున్న
విక్రమార్కుడు రీమేక్ లో బిజీగా ఉన్నాడు.
ఆ చిత్రం ప్రోమోలు ఇప్పటికే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి.
మహేష్
బాబు, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో ఒక సినిమా
వస్తుందంటే దానికి అంచనాలు భారీగా ఉంటాయి. ఈ కాంబినేషన్కు
ఉన్న క్రేజ్ దృష్ట్యా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్
సంస్థ బారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.'దూకుడు' సినిమా సూపర్ హిట్ కావటంతో
ఈ చిత్రనిర్మాణ సంస్థకు మహేష్ సినిమాతో మరో
మారు మెగా హిట్ కొడతామనే
నమ్మకంతో ఉంది. మరోవైపు హండ్రెడ్
పర్సెంట్ లవ్ హిట్ కావటంతో
సుకుమార్ మంచి ఫామ్లో
ఉన్నాడు. అవన్నీ దృష్టిలో పెట్టుకునే హాలీవుడ్ ట్రైనర్ ఆధ్వర్యంలో మహేష్ బాబు సిక్స్ప్యాక్
కోసం శ్రమిస్తున్నాడని చెప్తున్నారు.. అదే సమయంలో ముఖం
అందం చెడకుండా మహేష్ జాగ్రత్త పడుతున్నాడు. తొలిసారిగా మహేష్ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
మరో ప్రక్క మహేష్ బాబు ఈ
చిత్రంలో లేడీ గెటప్ లో
కనిపించి నవ్విస్తూ అబిమానులను అలరించనున్నడని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. మహేష్,సుకుమార్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రంలో
ఈ గెటప్ కనిపిస్తుందని చెప్పుకుంటున్నారు.
సుకుమార్ రిక్వెస్ట్ చేసి మహేష్ చేత
ఒప్పించాడని చెప్పుకుంటున్నారు. ఇది రూమరో,నిజమో
కానీ,ఓ కొత్త గెటప్
లో మహేష్ కనపించనుండటం మహేష్
అభిమానులను ఆనందపరుస్తోంది. ఈ చిత్రంలో కాజల్
అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. కొరియోగ్రాఫర్
ప్రేమ్ రక్షిత్ ఆధ్వర్యంలో పాట చిత్రీకరిస్తున్నారు. సంక్రాంతి నాటికి
ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా
కథ విషయానికొస్తే... గోవా బ్యాక్ డ్రాప్తో ఈ చిథ్ర
కథ నడుస్తుందని తెలిసింది. అంతే కాకుండా ఇందులో
మహేష్ బాబు తొలిసారిగా సిక్స్
ప్యాక్ బాడీతో కనిపించనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మహేష్
బాబు ఇందులో లెక్చరర్ పాత్ర చేస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు ‘సీతమ్మ
వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
వెంకటేష్, మహేష్ బాబు, సమంత,
అంజలి ప్రధాన పాత్రలుగా మల్టీ స్టారర్ గా
ఈ చిత్రం రూపొందుతోంది.
0 comments:
Post a Comment