శ్రీరామరాజ్యం'
తరవాత నటనకు స్వస్తి అని
చెప్పి నయనతార కొన్ని నెలలపాటు సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ప్రభుదేవాతో
చెడిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ
ఇచ్చింది. మళ్లీ మనసు మార్చుకుని
మొదలెట్టిన సెకండ్ ఇన్నింగ్స్ ప్రయాణం లో ఆమె వరస
ఆఫర్స్ తో బిజీ అయిపోయింది.
ఇలా గ్యాప్ ఇచ్చి వచ్చిన వాళ్లు
ఇంతలా బిజీ అవ్వటం అవ్వటం
అనేది సిని పరిశ్రమకు సంభదించినంతవరకూ
చాలా అరుదైన విషయమనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్న
ఆమె ఈ విషయమై మీడియాతో
మాట్లాడింది.
ఆమె
''నిజం చెప్పాలంటే రెండో ఇన్నింగ్స్ లో
ఇంతటి ఆదరణ నేను కూడా
వూహించలేదు. చిత్ర పరిశ్రమ నన్నూ,
నా పరిస్థితినీ అర్థం చేసుకొంది. సినిమాలకు
స్వస్తి చెప్పినప్పుడు నా నిర్ణయాన్ని ఎంత
గౌరవించారో, మళ్లీ రావాలి అనుకొన్నప్పుడు
అంతగా ప్రోత్సహిస్తున్నారు. నా గురించి నేను
ఆలోచించుకొనే తీరిక లేనంతగా షూటింగ్లతో మమేకమైపోయా. దర్శకుల
నమ్మకాన్ని వమ్ము కానివ్వను'' అంది.
అయితే నయనతార తన ఈ రీ
ఎంట్రీ లో చాలా జాగ్రత్తలు
తీసుకుంటోంది. కెరీర్ కి,పర్శనల్ లైప్
కి ముడి పెట్టకుండా కొనసాగాలని
భావిస్తోంది.
కొద్ది
రోజుల క్రితం నయనతారని రీసెంట్ గా తమిళ హీరో
శింబు సరసన చేయించటానికి ఓ
నిర్మాత ఎప్రోచ్ అయ్యాడు. దానికి ఆమె సవాలక్ష కండీషన్స్
పెట్టింది. అందులో మొదటిది సినిమా షూటింగ్ జరుగుతున్నంత కాలం శింబు తన
వ్యానెటీ వాన్ వద్దకు రావటానకి
వీల్లేదని..రెండవది..పర్శనల్ గా మాట్లాడటానికి ట్రై
చేయకూడదని...మూడోది..ఆమెకు మూడు కోట్లు
రెమ్యునేషన్ ఇవ్వాలని. ఇప్పటివరకూ ఏ సౌతిండియిన్ హీరోయిన్
కి రెండు కోట్లు మించి
రెమ్యునేషన్ ఇవ్వలేదు..దాంతో ఈ కండిషన్స్
విన్న నిర్మాత షాక్ అయ్యారు.
ఇక ఈ కండీషన్స్ కు
నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచనలో
పడుతున్నారు. ఇక ఈ చిత్రం
పేరు వాలు. దర్శకుడు అమ్మరాజశేఖర్
అశోశియేట్ విజయ్..అతను ఈ చిత్రంతో
పరిచయమవుతున్నాడు. నిక్ ఆర్ట్స్ చక్రవర్తి
ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శింబు,నయనతార కాంబినేషన్
లో మళ్లీ సినిమా వస్తే
గ్యారెంటీగా వర్కవుట్ అవుతుందని భావించి చాలా కాలంగా ఆమెను
ఎప్రోచ్ అవుతున్నారు.
ప్రస్తుతం
నయనతార తెలుగులో నాగార్జున,దశరధ్ కాంబినేషన్ లో
ఓ చిత్రం కమిటైంది. అదికాక క్రిష్ దర్శకత్వంలో రానా హీరోగా రూపొందుతున్న
కృష్ణం వందే జగద్గురంలోనూ ఆమె
హీరోయిన్ గా చేస్తోంది. మరో
రెండు తమిళ సినిమాలు సైతం
ఆమె కమిటైంది. బాలకృష్ణ కూడా తను డైరక్ట్
చేద్దామనుకున్న నర్తన శాలలో ఆమెను
హీరోయిన్ గా అడుగుతున్నాడు.
0 comments:
Post a Comment