పవర్
స్టార్ పవన్ కళ్యాణ్... సూపర్
స్టార్ రజనీకాంత్ దారిలో నడవబోతున్నారా? అంటే అవుననే సమాధానం
వినిపిస్తోంది ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి.
ప్రస్తుతం రజనీకాంత్ ‘కొచ్చాడయాన్’
అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ
చిత్రంలో మోషన్ క్యాప్చరింగ్ టెక్నాలజీని
వాడుతున్నారు.
హాలీవుడ్
సినిమాలకు మాత్రమే పరిమితం అయిన ఈ టెక్నాలజీ...
ఇండియాలోనే తొలిసారిగా కొచ్చాడయాన్ చిత్రంలో వాడుతున్నారు. దీని ద్వారా ప్రేక్షకులకు
అత్యుత్తమ విజువల్ క్వాలిటీ, ఎన్నో అద్భుతాలు చూపించ
వచ్చు. ఖర్చు కూడా భారీగానే
అవుతుంది.
ఇలాంటి
టెక్నాలజీ ఉపయోగించి భారీ బడ్జెట్‌తో...రొటీన్ సినిమాలకు భిన్నంగా పవన్ కళ్యాన్ ఓ
సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ మేరకు దర్శకులు,
టెక్నీషియన్స్‌తో ఇందుకు సంబంధించి
వివరాలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే
భవిష్యత్‌లో పవన్ హీరోగా
మనం ఒక భారీ సినిమాను
ఎక్స్పెక్ట్ చేయవచ్చు.
ప్రస్తుతం
పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం
తర్వాత పవర్ స్టార్ పూరి
జగన్నాథ్ దర్శకత్వంలో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ చిత్రంలో నటించనున్నారు.
0 comments:
Post a Comment