పవర్
స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్
సింగ్’
చిత్రానికి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? అంటే రకరాకలుగా
సమాధానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అప్పట్లో అయితే ఈచిత్రానికి పవన్
రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో సగం వాటా తీసుకుంటున్నారని,
నిర్మాత 30కోట్ల పైచిలుకు లాభం
పొందారు కాబట్టి పవన్ రెమ్యూనరేషన్ కూడా
రూ. 15 కోట్లపైనే ఉంటుందని గుసగుసలు కూడా వినిపించాయి.
తాజాగా
మీడియా సమావేశంలో నిర్మాత గణేష్ను ఇదే
విషయమై ప్రశ్నించగా....పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్
ఇంకా ఫైనలైజ్ కాలేదని సమాధానం ఇచ్చారు. పవర్ స్టార్ నిర్మాతలను
డబ్బుకోసం వేధించే రకం కాదన్నారు. ఆయన
డబ్బుకు కాకుండా హ్యూమన్ రిలేషన్స్, మోరల్ వాల్యూస్కి
ఎక్కువ విలువ ఇస్తారు. ఆయన
సొంత బ్యానర్లే చేయాల్సిన సినిమాను నా కోసం నన్ను
నిర్మాతగా నిలబెట్టడం కోసం నాకు అవకాశం
ఇచ్చారు అంటూ టాపిక్ డైవర్ట్
చేసి పవన్కి ఇచ్చే
రెమ్యూనరేషన్ ఎంతో చెప్పకుండా తప్పించుకున్నాడు
గణేష్.
నిర్మాత
వ్యాఖ్యలను బట్టి చూస్తే పవన్
కళ్యాణ్కు లాభాల్లో సగం
వాటా ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే తన సొంత బ్యానర్లో
చేయాల్సిన సినిమాను బండ్ల గణేష్ బ్యానర్లో
చేశారు కాబట్టి. అదే జరిగితే పవర్
కళ్యాణ్ టాలీవుడ్లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా రికార్డు సృష్టించడం ఖాయం.
గబ్బర్
సింగ్ చిత్రం విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు నిర్మాత
ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా రేపు(మే 31)న
హైదరాబాద్లో ప్లాటినమ్ డిస్క్
వేడుకకు ప్లాన్ చేశారు. పవర్ స్టార్ కూడా
ఈ వేడుకకు హాజరు అవుతుండటం విశేషం.
తన సినిమాలకు సంబంధించి ఎన్నడూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనని పవన్...ఇక్కడ ఏం మాట్లాడతారో
అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
0 comments:
Post a Comment