హైదరాబాద్:
నందమూరి హీరో బాలకృష్ణ అధినాయకుడుకు
రాజకీయ రంగు పులిమి ఆ
చిత్ర విడుదలను వాయిదా వేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఎన్నికల సంఘాన్ని
కోరడం హాస్యాస్పదమని తెలుగు యువత రాష్ట్ర అధికార
ప్రతినిధి కోనేరు చిన్ని విమర్శించారు. చిత్ర సన్నివేశాలను బట్టి
సంభాషణలు ఉంటాయని ఆయన వివరించారు. వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సాక్షి పత్రిక,
టివి ఛానల్లో ప్రత్యర్థులపై
ఇష్టం వచ్చినట్లుగా రాసి, కూయిస్తున్నారని మండిపడ్డారు.
ప్రజలకు
వినోదాన్ని ఇచ్చే సినిమాను ఆపాలనడం
గర్హనీయమన్నారు. చిత్ర విడుదలకు ఎలాంటి
ఆటంకాలు లేకుండా చూడాలని ఎన్నికల సంఘానికి ఆయన ఈ సందర్భంగా
విజ్ఞప్తి చేశారు. కాగా అధినాయకుడు చిత్రం
విడుదలను నిలిపి వేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బుధవారం ఎన్నికల సంఘాన్ని కోరిన విషయం తెలిసిందే.
అధినాయకుడు చిత్రంలో కొన్ని అభ్యంతరకర దృశ్యాలు ఉన్నాయని వారు ఎన్నికల సంఘానికి
ఫిర్యాదు చేశారు.
సినిమాలో
బాలకృష్ణ వేసిన సెటైర్లపై
వారు తీవ్ర అభ్యంతరం తెలిపారు.
అదే సమయంలో ఉప ఎన్నికల ప్రచారానికి
తాను రాకపోయినప్పటికీ తన సినిమాను పంపిస్తున్నానని
బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను కూడా
వారు ప్రస్తావించారు. ఈ చిత్రం విడుదల
విడుదలను వెంటనే నిలిపివేయాలని, ఉప ఎన్నికలు అయిపోయాక
విడుదలకు అనుమతించాలని వారు ఈసిని కోరారు.
మంచి
నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలి
కానీ రోడ్ల మీద కాదు,
ఉన్నట్టుండి ఈ విగ్రహ రాజకీయాలు
ఎందుకు మొదలు పెట్టావో, చెబుతావా
లేక చెప్పించమంటావా అనే డైలాగ్ ట్రయరల్స్లో కనిపిస్తోంది. ఇది
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించే అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి
విగ్రహాలను జగన్ రాష్ట్రంలోని అన్ని
చోట్ల పెట్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో
వారు ఈసిని ఆశ్రయించారు.
తన పదవి పోతుందనే తెలంగాణ
జెఏసి చైర్మన్ ఆచార్య కోదండరామ్ తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల
చంద్రశేఖర రావుకు సరెండర్ అయ్యారని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ విమర్శించింది. జెఏసి కాస్త కెసిఆర్,
కోదండరాంల జాయింట్ యాక్టింగ్ కమిటీగా మారిందని, దాన్ని తెరాస అనుబంధ భజన
మండలిగా నమోదు చేయస్తే సరిపోతుందని
ఎద్దేవా చేశారు.
0 comments:
Post a Comment