పాపం
బాలయ్య సినిమా ‘అధినాయకుడు’ చిత్రానికి విడుదల గడియలు ఇంకా ఆసన్నమైనట్లు లేదు.
షూటింగు పూర్తి కాక పోవడం, పోస్టు
ప్రొడక్షన్ లేటవడం లాంటి కారణాలతో సక్రాంతి
బరి నుంచి తప్పుకున్న ఈ
చిత్రం అనంతరం ఫైనాన్సియల్ ట్రబుల్స్తో రెండు మూడు
నెలలు కొట్టుమిట్టాడింది. ఎట్టకేలకు దాసరి లాంటి సినీ
పెద్దలు కల్పించుకుని మ్యాటర్ సెటిల్ చేయడంతో జూన్ 1న ఈ
చిత్రం విడుదలకు సిద్ధం అయింది.
బాలయ్యతో
పాటు, దర్శక నిర్మాతలు, యూనిట్
సభ్యలు, అభిమానులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటున్న
తరుణంలో ఈచిత్రానికి మళ్లీ వాయిదా భయం
పట్టుకుంది. ఈ సారి ఫైనాన్షియల్
మ్యాటర్ కాదు కానీ...రాజకీయ
కారణాలు. ఇటీవల విడుదలైన ఈచిత్రం
ట్రైలర్లో జగన్, చిరంజీవిపై
పరోక్షంగా సెటైర్లు విసురుతూ డైలాగులు ఉన్నాయి.
మంచి
నాయకులు ప్రజల గుండెల్లో ఉండాలి
గానీ, రోడ్డు మీద బొమ్మల్లో కాదు,
విగ్రహాల రాజకీయం చేస్తున్నావ్’
అంటూ బాలయ్య చెప్పే డైలాగ్ జగన్ను టార్గెట్
చేస్తూ ఉండగా....‘పదువులు ఇస్తామంటే వచ్చే వాడు నాయకుడు
కాదు, మీరూ మీ అధిష్టానం’ అంటూ
చెప్పే డైలాగ్ చిరంజీని ఉద్దేశించినట్లుగా ఉన్నాయని స్పష్టం అవుతోంది.
ఈ నేపథ్యంలో ఈచిత్రంపై జగన్ పార్టీ నేతలతో
పాటు, ఇతర నాయకులు ఎన్నికల
కమీషన్కి ఫిర్యాదు చేశారు.
ఉప ఎన్నికలు ముగిసే వరకు ఈ చిత్రాన్ని
వాయిదా వేయాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
దీంతో చిత్ర దర్శక నిర్మాతలతో
పాటు అభిమానుల్లో మళ్లీ ఆందోళన నెలకొంది.
మరి ఈసీ ఫిర్యాదుపై ఎలా
స్పందిస్తుంది? సినిమాను వాయిదా వేస్తుందా? లేక సెన్సార్ బోర్డుకు
వదిలేస్తుందా? ఆ సన్నివేశాలను, డైలాగులను
కట్ చేస్తుందా? అనేది సస్పెన్స్గా
మారింది. థియేటర్లన్నీ సిద్దం చేసుకున్న ఈచిత్ర నిర్మాతలకు ఉన్నట్టుండి వాయిదా అంటే భారీ నష్టం
తప్పదు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల మధ్య కొట్టుమిట్టాడిన నిర్మాతకు
సినిమా వాయిదా అనేది తలకు మించిన
భారమే అవుతుంది. మరి ఏం జరుగబోతోందో..
చూడాలి.
0 comments:
Post a Comment