Tuesday, May 8, 2012

Piaggio launches vespa lx 125 hyderabad


గత నెల 26 మార్కెట్లోకి విడుదల వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్ ఇప్పుడు రాష్ట్ర మార్కెట్కు విచ్చేసింది. ఇటాలియన్ గ్రూపు పియాజ్జియోకు చెందిన భారత అనుబంధ కంపెనీ పియాజ్జియో వెహికల్స్ భారత మార్కెట్లో పునఃప్రవేశపెట్టిన ఐకానిక్ వెస్పా స్కూటర్ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసింది. అంతేకాకుండా.. వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్ కోసం రాష్ట్ర మార్కెట్లో మూడు కొత్త డీలర్షిప్లను కూడా పియాజ్జియో ప్రారంభించింది.

హైదరాబాద్లో ఎస్పిఆర్ ఆటోమొబైల్స్, శ్రేయ్ ఆటోమోటివ్, స్మార్ట్ ఆటోలు వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్కు డీలర్లుగా వ్యవహరించనున్నాయి. వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్ను తొలిసారిగా 2012 ఢిల్లీ ఆటో ఎక్స్పోలో పియాజ్జియో ఆవిష్కరించింది.

వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్లో ఉపయోగించిన 124సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్గరిష్టంగా 7500 ఆర్పిఎమ్ వద్ద 10.26 బిహెచ్పిల శక్తిని, 6000 ఆర్పిఎమ్ వద్ద 10.6 ఎన్ఎమ్ టార్క్ను విడుదల చేస్తుంది. ఇండియాలో లభిస్తున్న స్కూటర్లలో కెల్లా ఇదే అత్యంత శక్తివంతమైనది (పవర్ఫుల్). వెస్పా ఎల్ఎక్స్ 125లో సివిటి (కంటిన్యూస్లీ వేరియబిల్ ట్రాన్సిమిషన్) గేర్బాక్సును ఉపయోగించారు.

వెస్పా ఎల్ఎక్స్ 125లో ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభ్యం కానుంది. దీని ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 8 లీటర్లు. ఇది ఎలక్ట్రిక్/కిక్ స్టార్ ఆప్షన్లతో లభిస్తుంది. ఎయిర్క్రాఫ్ట్లలో ఉపయోగించే సింగిల్ సైడెడ్ ట్రైలింగ్ ఆర్మ్ (ముందు చక్రానికి ఒకవైపు మాత్రమే ఉండే సస్పెన్షన్)ను ఉపయోగించారు. సింగిల్ పీస్ మోనోకాక్వ్ షాషీ (ఛాస్సిస్) కలిగిన ఏకైక స్కూటర్ వెస్పా ఎల్ఎక్స్ 125 మాత్రమే. రాష్ట్ర మార్కెట్లో వెస్పా స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.68,814 గానూ, ఆన్-రోడ్ ధర రూ.79,900 గానూ ఉంది. బుకింగ్ చేసుకున్న నెల రోజుల్లోపే డెలివరీ ఇస్తామని డీలర్లు చెబుతున్నారు.

హైదరాబాద్లో వెస్కా ఎల్ఎక్స్ 125 స్కూటర్ డీలర్ల చిరునామా:

* SMART AUTO
Plot No - 729, Kavya House,
Road No. 36, Jubilee Hills,
Next to IBP Petrol Station, Hyderabad
Pincode : 500 033
Phone Nos: 040 2355 2377 / 040 2355 2655 / 040 23559355

* SPR Automobiles
#3-6-307, Hyderguda,
Basheerbagh, Hyderabad
Pincode : 500029
Phone: 040-40264076

0 comments:

Post a Comment

Disclaimer

Buy original DVDs, CDs and cassettes from the nearest store. These are provided to give users the idea of best movies & music. All the rights are reserved to the audio company. This blog owner holds no responsibility for any illegal usage of the content.
Related Posts Plugin for WordPress, Blogger...

TW

Surfguiden
DMCA.com

feeds

Submit Blog & RSS Feeds Best Indian websites ranking submit site Increase traffic Entertainment Blogs
Entertainment directory BritBlog
Online Marketing
Oferty i praca w Zarabiaj.pl Submit Your Site To The Web's Top 50 Search Engines for Free!

wibiya widget