"విజయమ్మ,
షర్మిలా నర్శిపట్నంలోని నా ఇంట్లోనే బ స చేసారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే
నేను ఎప్పుడూ వారి ఫ్యామిలీని ప్రేమిస్తాను" అంటూ పూరి జగన్నాధ్ ట్వీట్ చేసారు.
ఆ ట్విట్ ఇప్పుడు అంతటా హాట్ న్యూస్ గా మారింది. వైయస్ ఆర్ కాంగ్రేస్ పార్టీలో పూరి
జగన్నాధ్ చేరుతున్నారంటూ ప్రచారం మొదలైంది. ప్రచారంలో భాగంగా నర్సీపట్నం వచ్చిన షర్మిలా,విజయమ్మ
పూరీ జగన్నాధ్ ఇంట్లో స్టే చేసారు. గతంలోనూ పూరి జగన్నాధ్ కూతురు శారీ పంక్షన్ కి వైయస్
జగన్ వచ్చి ఆశ్వీవాదం అందచేసిన సంగతి తెలిసిందే.
ఇక వైయస్ మరణించిన
కొత్తలో ఆవేశంగా ఆ మహానాయకుడి జీవితాన్ని తెరకెక్కించడానికి స్టార్ డైరెక్టర్ పూరీ
జగన్నాధ్ ముందుకు వచ్చారు. స్వయంగా నిర్మించి దర్శకత్వం వహిస్తానని ప్రకటించారు. అంతకు
ముందే ఆ సినిమా తీస్తామని జీవితా రాజశేఖర్ లు విలేకరుల ఎదుట చెప్పారు. ఎటూ పూరీ వంటి
పెద్ద దర్శకుడు తీస్తున్నాడు కాబట్టి వాటా కలుద్దామని ఈ దంపతులు వెళ్ళారు. తాను సొంతంగా
ఈ సినిమా నిర్మించాలనుకుంటున్నానని, వాటాలు ఇవ్వబోనని పూరీ స్పష్టం చేశారట. కనీసం వైయస్
పాత్ర అయినా దొరుకుతుందేమోనని పూరీ చుట్టూ తిరిగిన రాజశేఖర్ కు నిరాశే మిగిలింది. ఇప్పుడీ
సినిమా గురించి ఇటు పూరీ కానీ అటు జీవితారాజశేఖర్ లు నోరు మెదపడంలేదు.
సినిమాకు సంబంధించిన
పకడ్బందీ కథ పూరీ వద్ద ఉన్నట్టు తెలుస్తోంది. సినిమా గురించి ప్రకటించిన తర్వాత వైయస్
జగన్ ముందుకొచ్చి డబ్బు పెడతారని, నిర్మాతగా తానే ఉండవచ్చని జగన్నాధ్ భావించినట్టు
సినిమా పరిశ్రమలో గుసగుసలు విన్పించాయి. కొన్ని వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాలను నిర్వహిస్తున్న
జగన్ పూరీకి బాసటగా నిలిచిఉంటే సినిమాను రిచ్ గా తీయడానికి వీలయ్యేది. అయితే ఆ ప్రాజెక్టు
మెటీరియలైజ్ కాలేదు. ఈ స్టేట్ మెంట్ ఇచ్చిన నేపధ్యంలో మళ్లీ ఆ ప్రాజెక్టు తరమీదకు వస్తుందా
అని సందేహాలు సైతం కలుగతున్నాయి.
బిజినెస్ మ్యాన్
చిత్రంతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చిన పూరి జగన్నాధ్ ప్రస్తుతం దేముడు చేసిన మనష్యులు
చిత్రం చేస్తున్నారు. రవితేజ,ఇలియానా కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ చిత్రం సోషియో ఫాంటసీ
అని తెలుస్తోంది. వరస ప్లాపుల్లో ఉన్న రవితేజ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.
మళ్లీ ఇడియట్ నాటి హంగామా ఈ చిత్రంలో కనపడుతుందని చెప్తున్నాడు. రీసెంట్ గా రవితేజ
హీరోగా వచ్చిన దరువు చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చకుంది.
0 comments:
Post a Comment