వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు
చెందిన సాక్షి దినపత్రికపై రామోజీ రావు ఈనాడు దినపత్రిక
నిప్పులు చెరిగింది. ఈనాడుది రహదారి, సాక్షిది అడ్డదారి అంటూ రజనీకాంత్ సినిమా
డైలాగును తలపించే శీర్షికతో సాక్షి దినపత్రిక కథనంపై మండిపడింది. అర్థం లేని గణాంకాలతో,
తలాతోకా లేని వితండ వాదనలతో
ఈనాడుపై సాక్షి విషం చిమ్ముతోందని ఈనాడు
దినపత్రిక మండిపడింది. సాక్షి యజమాని, ఆయన కుటుంబ సబ్యులు,
వారి కిరాయి మూకల అకృత్యాల నుంచి
ప్రజల దృష్టిని మళ్లించడం, తన వారికి బాకాలూదడం,
పోటీ పత్రికలపై బురద చల్లడం... ఇదీ
విధానమని వ్యాఖ్యానించింది.
అదే కోవలో ఈనాడులో వాటాల
విక్రయానికి కూడా వక్రభాష్యాలు చెబుతోందని
విమర్శించింది. ఈనాడు షేరు విలువ
రూ. 5,28,630 అని చెబుతున్న సాక్షి..
ఆ విలువ ... ఉషోదయ ఎంటర్ప్రైజెస్లోని మూడు విభాగాల
మొత్తం షేరు విలువ అనే
విషయాన్ని కావాలనే సాక్షి విస్మరిస్తోందని తప్పుపట్టింది. అంతే కాదు, మొత్తం
షేర్ల సంఖ్య ఎంతో చెప్పకుండా
పాఠకులను తప్పుదోవ పట్టిస్తోందని వ్యాఖ్యానించింది.
కేవలం
ఈనాడు షేరు విలువను సాక్షి
పద్ధతిలో లెక్కిస్తే ఒక్కో షేరు విలువ
రూ. 275 మాత్రమేనని ఈనాడు దినపత్రిక స్పష్టం
చేసింది. ప్రారంభం కూడా కాక ముమదు
సాక్షికి లెక్కకట్టిన షేరు విలువ రూ.
360 అని చెప్పింది. దీనికన్నా తమ షేరు విలువ
తక్కువ అని తెలిపింది. సాక్షి
చేస్తున్న విషప్రచారాలు పాఠకుల ఆదరణ, మదుపుదారుల విశ్వసనీయత
మెండుగా ఉన్న రామోజీ గ్రూపు
సంస్థల ప్రతిష్టను ఏమీ చేయలేవని, కోర్టులను
కూడా జగన్ తప్పుదోవ పట్టించేందుకు
తెగబడుతున్నారని, అందుకే వాస్తవాలను పాఠకుల ముందుంచుతున్నామని ఈనాడు దినపత్రిక వివరణ
ఇచ్చుకుంది.
తమ కంపెనీ షేరును రూ. 350కి విక్రయించడాన్ని సిబిఐ
తప్పు పడుతోందని, మరి తమ కంపెనీ
షేర్లను ఇతరులకు కేటాయించడానికి సరిగ్గా ఏడు నెలల ముందు
ఈనాడు కూడా తన వాటా
విక్రయించిందని, రూ. 1,800కోట్ల నష్టాల్లో ఉండి
కూడా అది రూ. 6,800 కోట్ల
వాల్యుయేషన్తో రూ. 100 విలువ
గల ఒక్కో షేరును రూ.5,28,630
చొప్పున విక్రయించిందని, మరి దేశంలోనే ఎనిమిదో
స్థానంలో ఉన్న సాక్షి పత్రిక
వాల్యుయేషన్ దాంట్లో సగం కూడా చెయ్యదా,
ఆ ధరకు బయటివాళ్లకు షేర్లు
కేటాయించడం తప్పా సార్ అంటూ
వైయస్ జగన్ కోర్టులో చేసిన
వాదనకు రామోజీ ఈనాడు దినపత్రిక ఆ
రకంగా కౌంటర్ ఇచ్చింది.
0 comments:
Post a Comment