సునీల్
రెడ్డి బయటనే కాదు, జైలులో
కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి
తోడుగా నిలిచారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో నిందితుడైన వైయస్ జగన్ సన్నిహితుడు
సునీల్ రెడ్డి ఇది వరకే చంచల్గుడా జైలులో ఉన్నారు.
సునీల్ రెడ్డితో వైయస్ జగన్మోహన్ రెడ్డి
బుధవారం బ్యాడ్మింటన్ ఆడినట్లు సమాచారం.
ఏదో ఒక పనిలో నిమగ్నం
కావడానికి వైయస్ జగన్ జైలులో
యత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన జైలులో షటిల్
బ్యాడ్మింటన్ ఆడాడు. సునీల్ రెడ్డితో కలిసి ఆయన షటిల్
బ్యాడ్మింటన్ ఆడినట్లు వార్తలు వచ్చాయి. జైలులో ఐదు షటిల్ బ్యాడ్మింటన్
కోర్టులున్నట్లు జైలు సూపరింటిండెంట్ వెంకటేశ్వర
రెడ్డి చెప్పినట్లు ఆ ఆంగ్ల దినపత్రిక
రాసింది. ఖైదీలు వీటిలో బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చునని ఆయన చెప్పారు. జగన్
ఉదయం పూట యోగా చేసినట్లు,
ఆ తర్వాత షటిల్ బ్యాడ్మింటన్ ఆడినట్లు
ఆయన తెలిపారు.
జైలులో
వైయస్ జగన్కు టెలివిజన్
చూసే ఏర్పాటు ఉంది. అయితే, ఆయన
సాక్షి టీవీ చానెల్ను
చూసే పరిస్థితి లేదు. ఆ మాటకొస్తే
ఇతర పాపులర్ టీవి చానెళ్లను గానీ
జాతీయ చానెళ్లను గానీ చూసే అవకాశం
లేదు. జైలులో కేవలం ప్రసార భారతి
చానెళ్లను మాత్రమే అనుమతిస్తారు. వార్తా పత్రికలు మాత్రం ఆయన అందుతాయి.
న్యూస్
చానెళ్లను చూసే వసతి లేకపోవడంతో
ఉప ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆయనకు అవకాశం లేకుండా
పోయింది. అయితే, సందర్శకులు వచ్చినప్పుడు మాత్రం వార్తా చానెళ్లను చూడడానికి అవకాశం దొరుకుతుంది. జైలర్ గదిలో అన్ని
టెలివిజన్ చానెళ్లూ వస్తాయి.
జైలు
లోపల జగన్కు గట్టి
భద్రతను ఏర్పాటు చేశారు. ఎంక్లోజర్ గేట్ లోపల ఇద్దరు
కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశారు. వెలుపల కూడా ఇద్దరు కానిస్టేబుళ్ల
భద్రత ఉంటుంది. ఎంక్లోజర్ నుంచి బయటకు వచ్చినప్పుడు
ఇతర కానిస్టేబుళ్లు కూడా ఆయన వెంట
ఉంటారు.
0 comments:
Post a Comment