రామ్చరణ్తేజ, తమన్నా
లో సంపత్ నంది రూపొందించిన
చిత్రం రచ్చ. భాక్సాఫీస్ వద్ద
యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్
పరంగా ఇప్పటికీ చాలా చోట్ల స్టడీగా
ఉన్న ఈ చిత్రాన్ని మెగా
సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకాన
ఎన్.వి. ప్రసాద్, పారస్‌జైన్ నిర్మించారు. ముఖేష్
రుషి, నాజర్, కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్. నారాయణ, దేవ్గిల్, గీత, ఝాన్సీ ముఖ్యపాత్రలు
పోషించిన ఈ చిత్రం సెన్సార్
కట్స్ ఇలా ఉన్నాయి...
ఒకటి
రెండు రీళ్లలో:
1. 'అన్ని
పనులకు కలిపి మాట్లాడుకుందాం అన్నారు
మాట్లాడామంటావా' అని ఝాన్సీ అన్న
డైలాగ్లో ''అన్ని'',
''కలిపి''
పదాలను తొలగించారు.
2. ఎ)
'గిన్ని పగులుతుంది', 'గిన్ని జారింది' డైలాగ్స్లో ''గిన్ని'' పదం
వినరాకూడదన్నారు.
బి)
'పాకిస్తాన్' పదం వినకుండా చేసారు.
మూడు,
నాలుగు రీళ్లలో:
3. ఎ).
'డర్టీ ఇండియన్స్' పదంలోని ''డర్టీ'', 'సత్తు రూపాయిగాళ్లే'' పదం
లోని ''సత్తు'' వినబడకూడదన్నారు.
బి).
''ఆయనతో తప్పు చేస్తే పర్లేదా''
వినబడకూదన్నారు.
అయిదు,
ఆరు రీళ్లలో:
4). డ్యాన్స్
మాస్టర్‌తో మాట్లాడుతున్నప్పుడు వెనుక హీరోయిన్
తమన్నా వుండి, తొడలను ఎక్స్పోజ్ చేసే
క్లోజప్ దృశ్యాలను
తొలగించగా
అనుమతి పొందిన అంతే నిడివిగల వేరే
షాట్స్ని జతచేయడానికి అంగీకరించారు.
5). 'దిలక్
దిలక్...' పాటలో హీరోయిన్ తమన్నా
తన పిరుదులను కదిలించడం, ఆమె బెల్లి బటన్కి
సంబంధించిన
క్లోజప్ ఎక్స్‌పోజర్‌ని,
హీరో రామ్‌చరణ్ వేళ్లు
ఆమె తొడలపై కదలాడటం తొలగించగా అంతే నిడివిగల అనుమతి
పొందిన వేరే దృశ్యాలను అక్కడ
ఉంచడానికి అంగీకరించారు.
తొమ్మిది,
పది రీళ్లలో:
6). ఎ)
'నీయబ్బ', 'మధ్యప్రదేశ్','నీయయ్య', 'నీ యమ్మ' పదాలు
సినిమాలో ఎక్కడవున్నా వినరాకుండా
చేయమన్నారు.
బి).
'గాళ్ఫ్రెండ్ని కాల్‌గాళ్
చేసెయ్'వాక్యం వినరాకూడదన్నారు.
7). 'వానా
వానా..' పాటలో నేపథ్య సన్నివేశాలుగా
వచ్చిన బుద్ధ విగ్రహం దృశ్యాలను
తొలగించమనగా 'బుద్ధ విగ్రహం' దృశ్యాల్ని
బ్లర్ చేసారు.
8). పదకొండు
పన్నెండు రీళ్లో నోటిలోకి కత్తిదించడం, అది నోటిలోంచి బయటకు
రావడం తొలగించారు.
9). పదమూడు
పద్నాలుగు రీళ్లలో రెండుసార్లు గోడమీద రక్తం చిందే దృశ్యాలను,
ముఖేష్ రుషి చెయ్యి, విలన్
వెనుక
భాగంలో
ఆయుధం గుచ్చుకోవడం దృశ్యాలు తొలగించగా అందులో అంగీకారయోగ్యమైన 3.12 అడుగుల వేరే షాట్ని
ఉంచడానికి
అనుమతిస్తూ, మిగతా 1.66 అడుగుల నిడివి దృశ్యాలను తొలగించారు.
ఈ చిత్రాన్ని చూసిన 'ఇసి' తలిదండ్రుల పర్యవేక్షణలో
పిల్లలు చూడాలని నిర్దేశిస్తూ 12 కట్స్తో 3-4-12న
'యుఎ' సర్టిఫికెట్ జారీ చేసింది.
3987.51 మీటర్ల
నిడివిగల ' రచ్చ' 5-4-12న విడుదలైంది.
0 comments:
Post a Comment