త్వరలో
రాణా దగ్గుపాటి శివనారాయణ గా వెండి తెరను
పలకరించనున్నాడు. రామ్ గోపాల్ వర్మ
తాజా చిత్రం 'డిపార్ట్మెంట్'లో రాణా
ఓ ఢిపెరెంట్ పాత్రను పోషిస్తున్నాడు. మొదటి చేతిలో రివాల్వర్
కి పని పెట్టి(కాల్చి)
తర్వాత నోటి కి పనిపెట్టే
(మాట్లాడే)పాత్రలో రాణా జీవించాడంటున్నారు. తన గౌవరించే
వ్యక్తులకు ఒబీడియంట్ గా ఉండే ఈ
పాత్ర రాణా కి మంచి
పేరు తెచ్చి పెట్టి బాలీవుడ్ లో నిలబెట్టేది అవుతుంది
అంటున్నాడు.
చిత్రంలోని
తన పాత్ర గురించి రాణా
చెపుతూ..."నా రెండో హిందీ
సినిమా 'డిపార్ట్మెంట్'లో పోలీసాఫీసర్గా కనిపించబోతున్నాను. ఇది ఓ
క్లాసిక్ పోలీస్ డ్రామా. ముంబై మాఫియా చక్రం తిప్పుతున్న రోజుల్లో
దాన్ని అదుపు చేయడానికి ఏర్పాటుచేసిన
ప్రత్యేక 'డిపార్ట్మెంట్' కథ ఇది. సంజయ్దత్ సీనియర్ ఆఫీసర్గా, నేను కొత్తగా
రిక్రూట్ అయిన యువకునిగా నటించాం.
అమితాబ్ బచ్చన్ ఓ రాజకీయ నాయకునిగా
కనిపిస్తారు'' అని చెప్పుకొచ్చాడు. ఇక
గత సంవత్సరం రాణా చేసిన తొలి
హిందీ చిత్రం 'దమ్ మారో దమ్'భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది.
అలాగే
తన రెండో హిందీ చిత్రం
'డిపార్ట్మెంట్'గ్యారెంటీగా భాక్సాఫీస్
వద్ద పెద్ద హిట్ అవుతుందని
ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు దగ్గుపాటి రాణా. 'డిపార్ట్మెంట్'చిత్రం ఈ
నెల 18న విడుదల అవుతున్న
సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే
"నేను అమితాబ్, సంజయ్దత్, రాంగోపాల్
వర్మ సినిమాలు చూస్తూ పెరిగా. 'డిపార్ట్మెంట్' విడుదలయ్యాక అది బాక్సాఫీస వద్ద
ఎంత బాగా సందడిచేస్తుందో నాకు
తెలుసు. ఈ సినిమాలో పనిచేయడం
ద్వారా నేను ఎంతో నేర్చుకున్నా
అని చెప్పుకొచ్చారు.
అలాగే
తన ప్యూచర్ ప్రాజెక్టుల గురించి చెపుతూ... 'డిపార్ట్మెంట్' తర్వాత క్రిష్ డైరెక్షన్లో నేను చేస్తున్న
తెలుగు సినిమా 'కృష్ణం వందే జగద్గురుం' ప్రేక్షకుల
ముందుకు వస్తుంది. అందులో నయనతార హీరోయిన్. ఆ తర్వాత సెల్వరాఘవన్
డైరెక్షన్లో నా తొలి
తమిళ సినిమా చేస్తున్నా. అలాగే రాము రూపకల్పనలో
నథాలియా కౌర్తో కలిసి
హిందీలో ఓ రొమాంటిక్ థ్రిల్లర్
చేయబోతున్నా'' అని వివరించారు రాణా.
'కృష్ణం వందే జగద్గురుం'లో
రాణా బీటెక్ బాబుగా కనిపించనున్నారు. నయనతార దేవికగా ఓ విభిన్నమైన పాత్రను
చేస్తోంది.
డిపార్టమెంట్
చిత్రం తెలుగులోనూ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో దగ్గుపాటి
రాణా తో పాటు తెలుగు
వారైన లక్ష్మి మంచు,మధు షాలని
కూడా చాలా ముఖ్యపాత్రల్లో ఉన్నారు.
మధు షాలిని ఫిమేల్ గ్యాగస్టర్ రోల్ ని పోషిస్తోంది.ఈ చిత్రం షూటింగ్
కార్యక్రమాలు నవంబర్ లో ముగించుకుని పిభ్రవరిలో
రిలీజ్ చెయ్యటానికి సన్నాహాలు చేసుకుంటోంది.ఇక మధుశాలిని పాత్ర
సినిమాకి హైలెట్ కానుందని చెప్తున్నారు.ఆమె సినిమా అంతా
పూర్తిగా సిగెరెట్ కాలుస్తూంటుంది.ఆమె ఇంతకాలం సాఫ్ట్
రోల్ లో కనిపించింది.ఇప్పుడు
చాలా వైల్డ్ గా ఉండే పాత్రలో
అదరకొట్టనుందని,ఆమె పాత్ర సినిమాకి
హైలెట్ అని చెప్తున్నారు.
డిపార్టమెంట్
చిత్రం పోలీస్ వ్యవస్దకి, అండర్ వరల్డ్ ఆర్గనైజేషన్
మధ్యన ఉండే సంభందాలని ముఖ్య
కధా వస్తువుగా తీసుకుని మలచటం జరిగింది. దీంట్లో
అమితాబ్ ఒక రాజకీయ నాయకుడుగా
మారిన ఎక్స్ క్రిమినల్ పాత్రను
పోషిస్తున్నాడు.సంజయ్ దత్ అండర్
వరల్డ్ ని సమూలనంగా నాశనం
చెయ్యటానికి సృష్టించిన డిపార్టమెంట్ కి లీడర్ లోల్
వేస్తున్నారు. అభిమన్యు సింగ్ ఒక క్రూరమైన
క్రిమినల్ రోల్ ని పోషిస్తున్నాడు.
విజయ్ రాజ్ పరారీలో ఉన్న
ఒక మాఫియా డాన్ రోల్ పోషిస్తున్నారు.







0 comments:
Post a Comment