తమన్నాతో
రొమాన్స్ చేసిన పెళ్లి కాని
హీరోలంతా పెళ్లి పీటలెక్కుతున్నారని, హీరో కార్తీ దగ్గర
నుంచి నా వరకు అందరి
పరిస్థితి అలాగే అవుతోందని.... తమన్నాను
ఆటపట్టిస్తున్నాడు హీరో రామ్ చరణ్.
‘రచ్చ’
చిత్రం ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ఓ టీవీ కార్యక్రమంలో
ఈ సంఘటన చోటు చేసుకుంది.
ఈ కార్యక్రమంలో చరణ్ తమన్నాతో మాట్లాడుతూ...
కార్తితో కలిసి ‘సిరుతై’ చేశావ్, అదే టైమ్లో
అతని పెళ్లయిపోయింది. ఎన్టీఆర్తో కలిసి ‘ఊరసవెళ్లి’ చేశావ్.
సరిగ్గా అదే టైమ్లో
తారక్ కూడా పెళ్లి పీటలెక్కేశాడు.
అలాగే బన్నీ ‘బద్రీనాథ్’ చేశావ్. అతని పెళ్లి కూడా
ఆగిపోయింది. ఇప్పుడునాతో ‘రచ్చ’ చేశావ్. త్వరలో నా పెళ్లి కూడా
అయిపోతోంది. దీని బట్టి ఎవరైనా
పెళ్లి చేసుకోవాలంటే నీతో కలిసి నటిస్తే
సరిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు.
అలానే
నీ పెళ్లి జరుగాలంటే... రాణాతో నటించు. ఇప్పటికే అతనితో చేసిన జెనీలియాకు పెళ్లియిపోయింది
అంటూ చెప్పడంతో... అలా అయితే రాణాతో
నటించను, ఎందుకంటే నాకు ఇప్పుడే పెళ్లి
చేసుకోవాలని లేదు అంటూ కౌంటర్
ఇచ్చింది తమన్నా. ఇప్పుడున్న యంగ్ హీరోల్లో నీకు
ఎవరంటే ఇష్టం అని తమన్నా
చరణ్ ని అడగ్గా.... ఎన్టీఆర్
అంటే ఇష్టం. అతడు మంచి నటుడు,
మంచి డాన్స్ కూడా అని సమాధానం
ఇచ్చాడు.
‘రచ్చ’ చిత్రం
ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుని బీభత్సమైన కలెక్షన్లు రాబట్టింది. దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్తో
రూపొందిన ఈచిత్రం నాలుగు వారాలు ముగిసే సరికి రూ. 50 కోట్ల
పైచిలుకు కలెక్షన్లు సాధించింది. ఇవి కాక ఇతర
మార్గాల్లో వచ్చిన ఆదాయం వెరసి నిర్మాతలకు
భారీ లాభాలను తెచ్చి పెట్టింది.







0 comments:
Post a Comment