హైదరాబాద్:
తిరుమల వివాదం విషయంలో మాజీ మంత్రి శంకర
రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. సోమవారం శంకర రావు మీడియా
సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ తండ్రి లేని పిల్లవాడు అంటూ
ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ విషయంలో తిరుమలలో
డిక్లరేషన్ పైన రాద్దాంతం చేయడాన్ని
ఆయన తప్పు పట్టారు.
ముఖ్యమంత్రి
కిరణ్ కుమార్ రెడ్డి సతీమణి, పిల్లలు క్రిస్టియన్లేనని, వారు శ్రీ వేంకటేశ్వర
స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు
వెళ్లినప్పుడు డిక్లరేషన్ రాసిచ్చారా అని ఆయన ప్రశ్నించారు.
వారు డిక్లరేషన్ ఇవ్వని పక్షంలో జగన్కో ఓ
న్యాయం సిఎం భార్యకు మరో
న్యాయమా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి
ఓ బచ్చా అంటూ మండిపడ్డారు.
ఉప ఎన్నికల తర్వాత పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా
శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను ఇంటికి
పంపిస్తుందని చెప్పారు. 2014 వరకు కిరణ్ కుమార్
రెడ్డియే ముఖ్యమంత్రిగా ఉంటే కాంగ్రెసు స్మారక
భవనం కట్టుకోవాల్సిందేనని విమర్శించారు. ఉప ఎన్నికలలో జగన్
పార్టీ అభ్యర్థులను గెలిపించే విధంగా కిరణ్ చర్యలు ఉన్నాయని
ఆరోపించారు. ఉపఎన్నికలు ముమ్మాటికీ ప్రభుత్వానికి రిఫరెండమే అని చెప్పారు.
వైయస్
రాజశేఖర రెడ్డి మృతి చెందినప్పుడు ప్రస్తుత
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే
జగన్ను ముఖ్యమంత్రి చేయాలని
సంతకాలు చేశారని మరోసారి ఆరోపించారు. కాగా మంత్రి డిఎల్
రవీంద్రా రెడ్డి, శంకర రావులు నిత్యం
ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే
తిరుమల వివాదం విషయంలో కాంగ్రెసు పార్టీ నేతలు జగన్పై
విమర్శలు చేస్తుంటే శంకర రావు ఆయనకు
మద్దతివ్వడం విశేషం.







0 comments:
Post a Comment