హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మాజీ రాజ్యసభ సభ్యుడు
ఎంవి మైసురా రెడ్డి చేరడాన్ని తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి తప్పు పట్టారు. వైయస్
రాజశేఖర రెడ్డి అవినీతిపై ముందుగా ఫిర్యాదు చేసింది మాజీ రాజ్యసభ సభ్యుడు
మైసురా రెడ్డేనని ఆయన గుర్తు చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డిపై రాజా ఆఫ్ కరప్షన్
పుస్తకాన్ని తెచ్చిన మైసురా రెడ్డి ఎందుకు జగన్ పార్టీలో చేరారని
ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీలో చేరడం ద్వారా మైసురా
రెడ్డి చేసిన అవినీతి ఆరోపణలను
జగన్ ఆమోదించారని భావించాల్సి వస్తోందని ఆయన అన్నారు. మైసురా
రెడ్డిపై ఆయన తీవ్ర విమర్శలు
చేశారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మిలాఖత్
అయినట్లు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెసుకు, జగన్కు మధ్య
అంతర్గత వ్యవహారం కొనసాగుతోందని ఆయన అన్నారు. సీబీఐ
విచారణకు జగన్ను కాంగ్రెస్
నేతలు దగ్గరుండి మరీ సాగనంపడం చూస్తుంటే
వారిద్దరూ ఒక్కటయ్యారని రూఢీ అయిందని ఆయన
అన్నారు. కాంగ్రెసు అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, ఏలూరు
ఎమ్మెల్యే ఆళ్ళ నాని జగన్తో పాటు దిల్కుషా అతిథి గృహం
వరకూ కలిసి రావడం తెలిసిందే.
వైయస్
జగన్ ఆస్తుల కేసులో సిబిఐ నిష్పాక్షికంగా ముందుకు
వెళ్తుందనే నమ్మకం ఉందని మంత్రి శ్రీధర్
బాబు అన్నారు. ప్రజల మేలు కోసం
అప్పటి మంత్రులు కొన్ని నిర్ణయాలు తీసుకుని ఉండవచ్చునని ఆయన శుక్రవారం మీడియా
ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వాటి వల్ల మంత్రులు
వ్యక్తిగతంగా ప్రయోజనం పొందారో లేదో చూడాలని ఆయన
అన్నారు.
జగన్పై సిబిఐ విచారణ
వెనక ప్రభుత్వ కుట్ర ఉందనే విమర్సలను
ఆయన కొట్టిపారేశారు. 2009 తర్వాత రాష్ట్రంలో ఎన్నో ఉప ఎన్నికలు
జరిగాయని, ఎంతో మంది కాంగ్రెసుపై
గెలిచినా వారెవరిపైనా తాము కక్ష సాధించలేదని
ఆయన అన్నారు. జగన్ వ్యవహారంలో ప్రభుత్వ
పాత్ర లేదని, సిబిఐ తన పని
తాను చేసుకుని పోతోందని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment