హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని
సిబిఐ అధికారులు శుక్రవారం దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు.
రేపు మరోసారి సిబిఐ ముందు ఆయన
హాజరు కానున్నారు. శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ఆయన
దిల్కుషా అతిథి గృహం
నుంచి బయటకు వచ్చారు. ఆయన
అందరి వైపు నవ్వుతూ అభివాదం
చేశారు. మీడియాతో రెండు మాటలు చెప్పారు.
సిబిఐ వేసిన ప్రశ్నలకు సమాధానాలు
చెప్పానని, రేపు మళ్లీ సిబిఐ
విచారణకు హాజరవుతానని ఆయన చెప్పారు. ప్రశాంత
వాతావరణంలోనే విచారణ జరిగిందని ఆయన చెప్పారు. రేపు
ఉదయం పదిన్నర గంటలకు విచారణకు రానున్నారు.
వైయస్
జగన్ సిబిఐ విచారణ ముగిసి
బయటకు వచ్చే వరకు కూడా
తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డిలను విచారణ అనంతరం ఐదు గంటలకు చంచల్గుడా జైలుకు తరలించారు.
మంత్రి మోపిదేవి వెంకటరమణ విచారణను కూడా ముగించారు. ఆ
తర్వాత కూడా జగన్ను
విచారించడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఆయనను అరెస్టు చేస్తారా అనే సందేహం తలెత్తింది.
వైయస్సార్
కాంగ్రెసు పార్టీ నాయకుల్లో తీవ్ర ఆందోళన చోటు
చేసుకుంది. సిబిఐ విచారణ ముగిసిన
తర్వాత జగన్ ఇంటికి బయలుదేరి
వెళ్లారు. విచారణ కూల్గానే జరిగిందని
ఆయన చెప్పారు.జగతి పబ్లికేషన్స్లో
పెట్టుబడులు పెట్టిన 15 కంపెనీల గురించి సిబిఐ అధికారులు వైయస్
జగన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఆ 15 కంపెనీల యజమానులు ఎవరు, వాటి చిరునామాలు
ఏమిటి, నిధులు ఎవరు సమకూర్చారు వంటి
ప్రశ్నలు సిబిఐ అధికారులు జగన్
ముందు ఉంచినట్లు తెలుస్తోంది. వాన్పిక్ వ్యవహారంపై
కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానంద రెడ్డి, మోపిదేవి వెంకటరమణలతో కలిపి జగన్ను
కొంత సేపు ప్రశ్నించినట్లు సమాచారం.
ఆ తర్వాత విడిగా వైయస్ జగన్ను
ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
ఉదయం
గం.10.35 నిమిషాలకు విచారణ ప్రారంభించింది. సిబిఐ జాయింట్ డైరెక్టర్
లక్ష్మీ నారాయణ, సిబిఐ ఎస్పీ వెంకటేష్
ఆయనను విచారించారు. అనంతరం మధ్యాహ్న భోజనం కోసం అరగంట
పాటు సమయం ఇచ్చారు. భోజనం
అనంతరం మళ్లీ విచారించనున్నారు. వైయస్
జగన్ ఇంటి భోజనమే తిన్నారు.
ఆయన వ్యక్తిగత సిబ్బంది ఇంటి నుండి భోజనం
తీసుకు వచ్చింది. అర గంట విరామం
తర్వాత సాయంత్రం ఆరున్నర గంటల వరకు సిబిఐ
జగన్ను ప్రశ్నించింది.
విచారణ
ముగిసిన తర్వాత హైదరాబాదులోని లోటస్పాండు వద్ద
జగన్ ఇంటికి పెద్ద యెత్తున అభిమానులు
చేరుకున్నారు. ఆయన అక్కడికి చేరుకోగానే
అభిమానులు కాబోయే సిఎం అంటూ నినాదాలు
చేశారు. నవ్వుతూ వారికి జగన్ అభివాదం చేశారు.
కడప జిల్లా నుంచి, పులివెందుల నుంచి అభిమానులు పెద్ద
యెత్తున వచ్చారు. జగన్ ఇంటికి రావడంతో
కొంత ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. సిబిఐ డౌన్ డౌన్
అంటూ అభిమానులు పెద్ద యెత్తున నినాదాలు
చేశారు.
0 comments:
Post a Comment