హైదరాబాద్:
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను
అరెస్టు చేస్తే విధ్వంసం సృష్టించడానికి చేసిన కుట్రను సైబరాబాద్
పోలీసులు భగ్నం చేశారు. సైబరాబాద్
కమిషరేట్ పరిధిలోని మియాపూర్లో పోలీసులు వైయస్సార్
కాంగ్రెసు పార్టీకి చెందిన ముగ్గురు కార్యకర్తలను అరెస్టు చేశారు. వారి నుంచి పోలీసులు
విషయాలు రాబట్టారు. జగన్ను అరెస్టు
చేస్తే వంద బస్సులను ధ్వంసం
చేయడానికి వారు కుట్ర చేసినట్లు
సైబరాబాద్ పోలీసు కమిషరేట్ ఇంచార్జీ కమిషనర్ రాజీవ్ రతన్ చెప్పారు.
మియాపూర్లో అరెస్టు చేసిన
ముగ్గురి సెల్ ఫోన్ల నుంచి
వెళ్లిన మెసేజ్లను పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు.
శుక్రవారం బస్సులను తగులపెట్టిన కేసుల్లో వారు నిందితులను ఆయన
చెప్పారు. హైదరాబాదులోని సోమాజిగుడాలో పోలీసులు 25 మంది వైయస్సార్ కాంగ్రెసు
పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. వారి నుంచి పోలీసులు
వాస్తవాలు రాబట్టారు.
వెల్లాల
రామ్మోహన్, కోటంరెడ్డి వినయ్ రెడ్డి, పుత్తా
ప్రతాప రెడ్డి, రాజ్ ఠాకూర్, విజయకుమార్
విధ్వంసానికి కుట్ర చేసినట్లు పోలీసులు
తెలిపారు. అయితే, ఈ కుట్ర వార్తలను
వైయస్ జగన్ వర్గానికి చెందిన
కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఖండిస్తున్నారు.
వైయస్ జగన్ అల్లర్లకు, విధ్వంసానికి
వ్యతిరేకమని ఆయన చెప్పారు. తెలుగుదేశం,
కాంగ్రెసు పార్టీల కుట్రలో భాగంగానే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలకు విధ్వంసానికి కుట్ర చేశారనే వ్యూహాన్ని
పన్నారని ఆయన అన్నారు.
కాగా,
హైదరాబాదులో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు
చేశారు. నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. నాంపల్లి కోర్టు చుట్టూ భారీ భద్రతా ఏర్పాటు
చేశారు. నాంపల్లి కోర్టు వద్ద సిసి కెమెరాలను
ఏర్పాటు చేశారు. రాజభవన్కు వెళ్లే దారిలో
ఇనుప కంచెలు వేశారు. ఈ రోడ్డులోనే వైయస్
జగన్ను సిబిఐ విచారిస్తున్న
దిల్కుషా అతిథి గృహం
ఉంది. పోలీసులు చిన్న సమాచారంపై కూడా
స్పందిస్తున్నారు. శనివారం కొంత సేపు పోలీసులు
హైదరాబాదులో హడావిడి చేశారు.
0 comments:
Post a Comment