హైదరాబాద్:
మెగాస్టార్ చిరంజీవి అధికార దాహం వల్లనే తిరుపతి
శాసనసభా స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, సినీ నటి రోజా
అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు
వైయస్ జగన్ను దోషి
అని చెప్పలేమని ఆమె శనివారం మీడియా
ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ జగన్ తల్లి,
తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఉప
ఎన్నికల్లో ప్రచారం సాగిస్తారని ఆమె చెప్పారు. మోపిదేవి
వెంకటరమణ అరెస్టు కంటి తుడుపు చర్య
మాత్రమేనని, మొత్తం మంత్రివర్గ సభ్యులను అరెస్టు చేయాలని ఆమె అన్నారు.
వైయస్
జగన్ మీద పోటీ చేసిన
ఎంవి మైసురా రెడ్డిని తమ పార్టీలోకి వచ్చారని,
రాజకీయంగా ఎదుర్కోలేక వైయస్ జగన్ను
రాక్షసంగా ఎదుర్కుంటారనే బాధతో మద్దతు తెలపడానికి
తమ పార్టీలోకి మైసురా రెడ్డి వచ్చారని ఆమె అన్నారు. వైయస్
జగన్ను ఎవరూ ఆపలేరని
ఆమె అన్నారు. వైయస్ జగన్ చేతిలో
కాంగ్రెసుకు చావు దెబ్బ తప్పదని
ఆమె అన్నారు. మైసురా రెడ్డిని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించడాన్ని ఆమె తప్పు పట్టారు.
మీ పార్టీలో చేరితే మంచివాడు, వేరే పార్టీలో చేరితే
చెడ్డవాడా అని ఆమె తెలుగుదేశం
పార్టీ నాయకులను అడిగారు. మైసురా రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుల విమర్శలు బాధాకరమని ఆమె అన్నారు.
బతికి
ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డిని
ఎవరూ ఏమీ అనలేదని, మరణించిన
తర్వాత దోషి అంటున్నారని ఆమె
అన్నారు. వైయస్ జగన్ను
పార్టీ వీడిన తర్వాతనే విమర్శిస్తున్నారని,
కాంగ్రెసులో ఉంటే మంచివారు, వేరే
పార్టీ పెడితే చెడ్డవారు అయిపోతారా అని ఆమె అన్నారు.
వైయస్ జగన్పై చేస్తున్న
కుట్రను ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. కాంగ్రెసు
పార్టీకి ప్రజలు పట్టడం లేదని ఆమె అన్నారు.
రాష్ట్రం ఏమై పోయినా ఫరవాలేదనే
పద్ధతిలో వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు.
వైయస్
రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయంలో బలవంతంగా తన
చేత సంతకాలు పెట్టించారని మోపిదేవి అన్నట్లు వచ్చిన వార్తలపై ఆమె విరుచుకుపడ్డారు. గంగలో
దూకమంటే దూకుతారా, బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం లేదా, వైయస్
బతికి ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. వైయస్
జగన్కు ప్రజలను దూరం
చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె అన్నారు. సోనియా
గాంధీ బలవంతంగా సంతకాలు చేయించారని ఎవరైనా అంటే సోనియాను అరెస్టు
చేస్తారా అని రోజా అడిగారు.
వైయస్ జగన్ను ఇరికించడానికి
రోజుకో మాట్లాడుతున్నారని ఆమె అన్నారు. మోపిదేవిని
బలిపశువును చేశారని ఆమె అన్నారు.
వైయస్
జగన్ను అరెస్టు చేస్తే
కాంగ్రెసు తన చావును తానే
కోరుకున్నట్లవుతుందని ఆమె అన్నారు. జగన్ను అరెస్టు చేస్తారని
తాము భయపడడం లేదని ఆమె అన్నారు.
జగన్ను అరెస్టు చేస్తే
వైయస్ విజయమ్మ ప్రచారంలోకి దిగుతారని ఆమె చెప్పారు. ప్రభుత్వ
నిర్ణయాలకు మంత్రి వర్గం సమిష్టి బాధ్యత
వహించాల్సి ఉంటుందని ఆమె అన్నారు.
0 comments:
Post a Comment