కెరీర్
ఫేడవుట్ అయిపోయిన దశలో సాధారణంగా హీరోయిన్స్
కు ఐటం సాంగ్స్ వస్తూంటాయి.
ఆ మధ్యన ఛార్మి,శ్రియ
ఇలాగే ఐటం సాంగ్స్ చేసారు.
ఇప్పుడు ఆ ఐటం పాపల
లిస్ట్ లో సదా చేరింది.జయం నుంచి అపరిచితుడు
చిత్రం దాకా కంటిన్యూగా దాదాపు
30 సినిమాలు దాకా చేసుకుంటూ పోయిన
సదా ఆ తర్వాత చల్లబడిపోయింది.
ఆమె కెరీర్ పూర్తిగా క్లిక్ లాంటి హర్రర్ సినిమాల
స్ధాయికి పడిపోయింది. అప్పటికీ శ్రీకాంత్ సరసన ఆమె అఆఇఈ
వంటి సినిమాలు చేసినా అవి డిజాస్టర్ అయ్యి
ఆమెను మరింత పడేసాయి. దాంతో
ఆమె ఇక్కడ లాభం లేదనుకుంది
కన్నడ పరిశ్రమకు వెళ్లి సెటిలైంది. అక్కడా పెద్దగా కలిసిరాకపోవటంతో ఇప్పుడు మళ్లీ ఈ రకంగా
ఐటం సాంగ్ తో మళ్లీ
తన కెరీర్ ని మొదలు పెట్టాలనుకుంటోంది.
సుందర్
సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటిస్తున్న చిత్రానికి మదగజరాజా అనే చిత్రంలో ఆమె
ఐటం సాంగ్ ని ఓకే
చేసింది. అందుకోసం ఆమెకు మంచి మొత్తాన్నే
ఇచ్చినట్లు తెలుస్తోంది. విశాల్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో కార్తీక
హీరోయిన్గా నటిస్తోంది. దమ్ముతో
తన దమ్ముని చూపించిన కార్తీక ఈ చిత్రంలో మరో
సారి గ్లామర్ ని ఓ రేంజిలో
ఒలకపోసే పాత్రలో కనిపించనుందని చెప్తున్నారు.
ఈ చిత్రంలో సదా విశాల్తో
సింగిల్ సాంగ్కు స్టెప్స్
వేయనుంది. దీని గురించి ఈ
ముద్దుగుమ్మ చెబుతూ ఈ తరహా సాంగ్స్కు తాను పూర్తి
వ్యతిరేకినని చెప్పింది. ఇలాంటి అవకాశాల్ని ఇంతకు ముందు చాలా
తిరస్కరించానని అంది. సుందర్ సి
యూనిట్ నుంచి ఈ అవకాశం
వచ్చినప్పుడు తనకు ఆసక్తి లేదని
స్పష్టంగా చెప్పానని అంది. ఇది సాధారణంగా
వచ్చే ఐటమ్ సాంగ్ లాంటిది
కాదని చిత్ర కాన్సెప్ట్ను
వివరించడంతో నటించడానికి అంగీకరించినట్లు సదాతెలిపింది.
మరో ప్రక్క తెలుగు నుంచి సెకండ్ ఇన్నింగ్స్
మొదలెట్టాలని ప్రయత్నం మొదలెట్టింది. శివాజి, సదా జంటగా ఓ
చిత్రం రూపొందుతోంది. సత్తి శ్రీనివాసరెడ్డి ఈ
చిత్రానికి దర్శకుడు. సి.హెచ్.వి.ఎన్.బాబ్జీ, ఎస్.రత్నమయ్య నిర్మాతలు. 90 శాతం చిత్రీకరణ పూర్తి
చేసుకున్న ఈ సినిమా గురించి
నిర్మాతలు మాట్లాడుతూ -‘‘భిన్నమైన కథతో దర్శకుడు ఈ
చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దయ్యాలనేవి లేవనీ, అదంతా మన భ్రమనీ
చెప్పే సినిమా ఇది. ‘సాటి మనిషి
కష్టాల్లో ఉన్నప్పుడు నీ చేతనైతే సాయం
చేయ్. అదే నీకు శ్రీరామరక్ష’ అనే
నీతితో ఈ సినిమా తెరకెక్కుతోంది.







0 comments:
Post a Comment