విశాఖపట్నం:
నందమూరి హీరో బాలకృష్ణ తాజా
చిత్రం అధినాయకుడు సినిమాపై సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి
బుధవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధినాయకుడు చిత్రంలోని డైలాగులు ఓ పార్టీని ఉద్దేశించే
విధంగా ఉన్నాయని వారు మండిపడ్డారు. ఓ
పార్టీకి చెందిన డైలాగ్స్ ఉన్నాయన్నారు. రెండు రోజుల క్రితం
బాలకృష్ణ మాట్లాడుతూ... అధినాయకుడు చిత్రాన్ని ఉప ఎన్నికల ప్రచారం
కోసం పంపిస్తున్నామని చెప్పారని, ఆ వ్యాఖ్యలపై తాము
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు.
ఉప ఎన్నికల కోసం అధినాయకుడును పంపిస్తున్నానన్న
బాలకృష్ణ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సీరియస్గా
తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
సినిమా జూన్ 1వ తేదిన
విడుదలకు సిద్ధమైందని, ఓ పార్టీకి అనుకూలంగా
ఉన్నందున ఆ సినిమాను ఉప
ఎన్నికల తర్వాత విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
త్వరలో
జరగనున్న ఉప ఎన్నికలలో నేరుగా
తాను ప్రచారానికి రాకపోయినప్పటికీ తన సినిమాను పంపిస్తున్నానని
నందమూరి హీరో బాలకృష్ణ సోమవారం
రాత్రి హైదరాబాదులో అధినాయకుడు ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక సమయంలో చెప్పిన
విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బాలకృష్ణ
మాట్లాడారు. ఉప ఎన్నికల ప్రచారానికి
వస్తారా అని తనను అడుగుతున్నారని,
తాను తన అధినాయకుడు చిత్రాన్ని
ప్రచారానికి పంపిస్తున్నానని వారికి చెప్పానని అన్నారు.
అధినాయకుడు
సినిమానే ఎన్నికల ప్రచారాస్త్రం అన్నారు. తప్పు చేసిన వాడి
బెండ్ తియ్యడమే మన పని అని
అధినాయకుడులో అదే కనిపిస్తుందన్నారు. ప్రజల్లో ఒక
తిరుగుబాటుని, చైతన్యాన్ని తీసుకు వచ్చే మంచి చిత్రం
ఇది అవుతుందన్నారు. కాగా సోమవారం వైయస్సార్
కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు
వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టుపై స్పందించిన విషయం తెలిసిందే. జగన్
తప్పు చేశాడు కాబట్టే జైలుకు వెళుతున్నాడని అన్నారు.
జగన్
స్వయంకృపరాధం వల్లనే ఇలా జరిగిందన్నారు. తెలుగుదేశం
పార్టీలో స్వర్గీయ నందమూరి తారక రామారావు లాంటి
నాయకుడు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడే
అన్నారు. తాను సినిమాలలో బిజీగా
ఉన్నందు వల్లే ఉప ఎన్నికల
ప్రచారానికి వెళ్లలేదని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కోసం కుటుంబ సభ్యులం
అందరం కష్టపడతామని, అందరం కలిసే ఉన్నామన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ గురించి విలేకరులు ప్రశ్నించగా కలిసి వచ్చిన వారందరినీ
ఆహ్వానిస్తామన్నారు.
తన అధినాయకుడు చిత్రంలో సెటైర్లు వాస్తవమే అన్నారు. తాజా రాజకీయ పరిస్థితులను
అనుసరించి తన చిత్రంలో సెటైర్లు
ఉన్నాయన్నారు. బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ
నందమూరి తారక రామారావుకు నివాళులు
అర్పించారు. తెలుగు వారి కోసం ఎన్టీఆర్
ఎంతో చేశారన్నారు. ఈ రోజు ఎంతో
పర్వదినం అన్నారు. తాను అధినాయకుడులో ఏ
పార్టీని ఉద్దేశించి సెటైర్లు వేయలేదని, కేవలం ప్రస్తుత రాజకీయ
పరిస్థితులను ఉద్దేశించే ఉన్నాయన్నారు. బాలకృష్ణ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా చంద్రబాబుతో
కలిసి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో రోగులకు పండ్లు
పంచారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడారు.
0 comments:
Post a Comment