‘‘నేనెవరికీ
బినామీని కాను. ఇప్పటికే దీనిపై వచ్చిన ప్రచారాన్ని ఖండించా. ఓవర్‌నైట్ ప్రొడ్యూసర్‌ని
అయ్యేప్పటికి ఇలాంటి పుకార్లు వస్తున్నాయి. అవన్నీ వట్టిమాటలండీ... నేను ఈ స్థాయికి
ఎదగడం చూసి ఓర్వలేక ఎవరో పుట్టిస్తున్నారు ఇలాంటి వార్తలు. వాటిని నేను కేర్ చేయను’’ అని
గణేష్ సమాధానమిచ్చారు. బొత్స సత్యనారాయణకు గణేష్ బినామీ అని కొందరి అభిప్రాయం. వారికి
మిరిచ్చే సమాధానంమీడియా వారు అనడిగిన ప్రశ్నకు నిర్మాత గణేష్ బాబు అలా స్పందించారు.
"అలాగే
సినిమా హిట్ కాకపోతే నిర్మాత పరిస్థితి ఘోరం. అందుకని హిట్ సినిమానే తియ్యాలి. 'తీన్‌మార్'తో
హిట్ రాలేదని భయపడ్డ నేను 'గబ్బర్‌సింగ్' హిట్‌తో ఇంకా భయమేస్తోంది. రాబోయే సినిమా
ఇంకెంత బాగా తియ్యాలనేదే ఆ భయం. తెరపై ఇక నటించాలని నేను అనుకోవడం లేదు. మాస్ నుంచి
వచ్చినవాణ్ణి కాబట్టి మాస్ ఎంటర్‌టైనర్స్ అంటేనే ఎక్కువ ఇష్టం" గణేష్ అన్నారు.
"ఇక నాకు
చిన్న సినిమాలు తీసే గట్స్ నాకు లేవు. అందరు అగ్ర హీరోలతోటి పెద్ద సినిమాలే చేస్తా.
నేనెవరితో పనిచేసినా, అదే భక్తితో ఆ సినిమా సూపర్‌హిట్ కావాలనే లక్ష్యంతోనే పనిచేస్తా.
నేను పవన్ కళ్యాణ్ భక్తుణ్ణయినా, అందరితో బాగుంటా. అందరితో సినిమాలు చేస్తా. అందరితో
చెయ్యమని కల్యాణ్ కూడా చెప్పారు. ఎన్టీఆర్, శ్రీను వైట్ కాంబినేషన్ సినిమా 'బాద్‌షా'
సినిమా షెడ్యూలు జూన్ 15 నుంచి ఉంటుంది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది.
కృష్ణానగర్‌లో నేనూ, పూరి జగన్నాథ్ కలిసి తిరిగాం. 'గబ్బర్‌సింగ్' హిట్‌కి తను ఎంతో
ఆనందపడ్డాడు. అక్టోబర్ నుంచి ఆయన డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నా. హీరో ఎవరనేది
ఆయనే చెబుతాడు" ఆయన వివరించారు.
"ఈ సినిమా
రిలీజ్ అయ్యేంతవరకు పవన్ రెమ్యూనరేషన్ ఎంతనేది మేం మాట్లాడుకోలేదు. చరణ్ పెళ్లయ్యాక
విజయోత్సవ సభ పెడదామనుకుంటున్నా. దానికి కల్యాణ్ ఒప్పుకోవాలి. త్వరలో ఆయనతో మరో సినిమా
ఉంటుంది. ఎప్పుడనేది ఆయనతో మాట్లాడాక చెబుతా. చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న నన్ను
నిర్మాతని చేసింది పవన్ కళ్యాణ్. ఆయన లేకపోతే నిర్మాతగా నా జీవితమే లేదు" అని
చెప్పారు.
0 comments:
Post a Comment